బాలకృష్ణకు మగ అహంకారం.. దమ్ముంటే నాతో ఇది చేయ్ అంటూ రోజా సవాల్
టాలీవుడ్ నటిగా రోజా సెల్వమణి మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసింది. బ్లాక్ బాస్టర్ హిట్స్ ను సొంతం చేసుకుని తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అంతే కాదు టెలివిజన్ రంగంలోనూ జబర్దస్త్ ద్వారా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక నగరి ఎమ్యేల్యేగానూ ప్రజాసేవ చేసింది. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండింది. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. దమ్ముంటే తన సవాల్ ను స్వీకరించాలని తాజాగా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..
రోజా ఫిల్మ్ కెరీయర్..
1991లో రోజా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. అప్పటి నుంచి 2013 వరకు టాలీవుడ్ లో యాక్టివ్ గా కనిపిచింది. ప్రేమ తప్పస్సు చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత సర్పయాగం, సీతారత్నం గారి అబ్బాయి, అత్త సొమ్ము అల్లుడు దానం, రక్షణ, ముఠా మేస్త్రి, ముగ్గురు మొనగాళ్లు, బాలకృష్ణ సరసన భైరవ ద్వీపం, గాంఢీవం, బొబ్బిలి సింహం, శ్రీ కృష్ణార్జున విజయం, శ్రీరా రాజ్యం వంటి చిత్రాల్లో నటించింది. మరిన్ని చిత్రాల్లో కీలక పాత్రల్లో మెరిసింది. ఆ తర్వాత టెలివిజన్ రంగంలో రచ్చ బండ, బతుకు జట్కా బండి, జబర్దస్త్ కామెడీ షో వంటి టెలివిజన్ రియాలిటీ షోలతో అలరించింది.

రోజా రాజకీయ జీవితం..
1998 నుంచే రోజా సెల్వమణి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూ వస్తున్నారు. ఆమె తొలుత తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యింది. తెలుగుదేశం పార్టీ తరుపున రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది. ఇక వైఎస్ రాజశేఖర్ మరణానంతరం ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీలో జాయిన్ అయ్యి 2014లో నగరి అసెంబ్లీ స్థానం నుంచి గెలించింది. తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టింది. అయితే ఆ తర్వాత 2019లోనూ భారీ విజయాన్ని సాధించింది. ఈ క్రమంలో మినిస్టర్ పదవిని కూడా సొంతం చేసుకుంది.
బాలకృష్ణకు రోజా బహిరంగ సవాల్..
రోజా రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణకు మగ అహంకారం బాగా ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత షూటింగ్స్ చేయొచ్చు కానీ, నేను టీవీ షోలు చేస్తే తప్పుగా ప్రచారం చేశారు. ఆయన మాత్రం హీరోయిన్ల నడుము గిల్లుతూ, బ్యాక్ పై కొడుతూ డ్యాన్స్ లు చేస్తే తప్పులేదు కానీ, నేను టీవీ షోలో ఆర్టిస్టుల అందరితో కలిసి డ్యాన్స్ చేస్తే తప్పు వచ్చిందా? అని నందమూరి బాలకృష్ణను ప్రశ్నించింది.
ఇక ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు అసెంబ్లీకి హాజరయ్యారో చెప్పాలని, తన నియోజకవర్గంలో ఎంత అభివృద్ది చేశారో కూడా చూపించాలని తను కూడా స్వయంగా వచ్చి బాలకృష్ణ తప్పులను చూపిస్తానని సవాల్ విసిరింది. దమ్ముంటే నాతో ఈ సవాల్ చేయాలని ఛాలెంజ్ చేసింది. అలాగే పవన్ కళ్యాణ్ కు కూడా ఇదే సవాల్ విసిరింది.


Click it and Unblock the Notifications











