రోజా కొత్త బిజినెస్.. కూతురి ఆలోచనతో గ్రాండ్ ఓపెనింగ్.. షాకైనా సీనియర్ హీరోయిన్!

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ప్రముఖ రాజకీయ నాయకురాలు రోజా సెల్విమని మరో కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు. ఓ వైపు పొలిటీషియన్ గా మరోవైపు యాక్టర్ గా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ రోజా తన కూతురు సలహా మేరకు అప్పుడే బిజినెస్ లు లాంచ్ చేయిస్తున్నారు. ఇటీవల మొదలు పెట్టగా ఆ వేడుకకు సీనియర్ నటీమణి కూడా వచ్చారు.

నటిగా ఎంత బిజీగా ఉన్నా..

నటిగా ఎంత బిజీగా ఉన్నా..

ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో వెండితెరపై చెరగని ముద్ర వేసుకున్న రోజా రాజకీయాల్లోకి వెళ్లి అదే తరహాలో మంచి గుర్తింపు అందుకుంటున్నారు. నగరి ఎమ్మెల్యేగా గత రెండు ఎన్నికల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. నటిగా ఎంత బిజీగా ఉన్నా కూడా తన నియోజకవర్గ పాలనను ఆమె ఏ మాత్రం మరువడం లేదు.

ఫ్యామిలీతో కూడా ..

ఫ్యామిలీతో కూడా ..

ఇక నటిగా బిజీగా ఉన్నా లేకున్నా కూడా రోజా జబర్దస్త్ ను మాత్రం వదలడం లేదు. మొదటి నుంచి కూడా షో ద్వారా బుల్లితెర అభిమానులకు బాగా దగ్గరవుతున్నారు. ఇక ఫ్యామిలీతో కూడా ఆమె రెగ్యులర్ గా టైమ్ స్పెండ్ చేస్తుంటారు. అప్పుడప్పుడు హాలిడేస్ లో పిల్లలతో కలిసి విదేశాలకు కూడా వెళుతుంటారు.

అన్షుమాలిక గొప్ప మనసు

అన్షుమాలిక గొప్ప మనసు

అయితే ఇటీవల రోజా సెల్వమని భర్తతో కలిసి ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు. మొదట ఆ బిజినెస్ గురించి ప్రస్తావించింది ఆమె కూతురేనట. అన్షుమాలిక టీనేజ్ వయసు దాటడానికి చాలా దగ్గరలోనే ఉంది. ఇక ఆమె మంచితనంపై ఒక ఇంటర్వ్యూలో రోజా చాలా క్లియర్ గా వివరణ ఇచ్చారు. పేద విద్యార్థులకు ఎడ్యుకేషన్ పరంగా సొంతంగా తనకు తోచినంత సహాయం చేస్తోందట.

రోజా కూతురిని చూసి షాకైనా మహేశ్వరి

రోజా కూతురిని చూసి షాకైనా మహేశ్వరి

ఇక ఇటీవల అన్షుమాలిక సలహా మేరకు రోజా యూనిక్ బ్యూటీ సెలూన్ స్థాపించారు. గ్రాండ్ గా మొదలైన ఆ వేడుకకు సీనియర్ హీరోయిన్ మహేశ్వరి కూడా స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక రోజా కూతురిని చూసిన మహేశ్వరి అప్పుడే అన్షు ఇంత పెద్దగా అయిపోయిందా అంటూ షాక్ అయ్యింది.

హీరోగా రోజా తనయుడు

హీరోగా రోజా తనయుడు

రోజా తనయుడు కృష్ణ లోహిత్ సెల్వమని హీరోగా ఎంట్రీ ఇస్తాడాని గత ఇంటర్వ్యూలలో రోజా చాలా సార్లు వివరణ ఇచ్చారు. ఇంకా స్కూల్ దశలోనే ఉన్న అతను ప్రస్తుతం పూర్తిగా ఎడ్యుకేషన్ వైపే దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. ఎడ్యుకేషన్ అనంతరం తన ఇష్ట ప్రకారం ఏదైతే అది కావచ్చని రోజా వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X