Saindhav: వెంకటేష్ చిత్రంలో యంగ్ బ్యూటీ.. అందుకోసం కాకుండా.. మళ్లీ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్!

టాలీవుడ్ స్టార్ హీరోలలో దగ్గుబాటి విక్టరీ వెంకటేష్ ఒకరు. ఎన్నో కుటుంబ కథా చిత్రాల్లో నటించిన ఆయన ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ కుమారుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన తన నటనతో ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. ఇక ఇటీవల కాలంలో వెంకటేష్ ఎక్కువగా మల్టీ స్టారర్ చిత్రాలు, గెస్ట్ రోల్స్ తప్పా మెయిన్ హీరో సినిమా చేయలేదు. దృశ్యం 2 వంటి రీమెక్ సినిమా మినహాయించి.. స్ట్రయిట్ తెలుగు చిత్రం రాలేదు. ఈ క్రమంలో అటు ఓ వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి అడుగు పెడుతున్న వెంకీ మామా హిట్ 2 డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్ కు సంబంధించిన అప్డేట్ చక్కర్లు కొడుతోంది.

సైంధవ్ గా వెంకీ మామ..

సైంధవ్ గా వెంకీ మామ..

ఇటీవల హిట్ వర్స్ తో మంచి హిట్టు కొట్టాడు డైరెక్టర్ శైలేష్ కొలను. నేచురల్ స్టార్ నానితో హిట్ 3 తెరకెక్కిస్తున్న శైలేష్ కొలను దానికంటే ముందుగా ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న విక్టరీ వెంకటేష్ తో ఓ సినిమా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. వెంకటేష్ 75వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాకు 'సైంధవ్' అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఇటీవల విడుదల చేసిన ఈ టైటిల్ ఫస్ట్ గ్లింప్ వీడియోకు మంచి రెస్పాన్స్ లభించింది. ఈ వీడియోలో వెంకటేష్ ను మాస్ అవతారంలో చూసిన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. చాలా కాలం తర్వాత వెంకటేష్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ రోల్ చేయనున్నాడని సంబరపడిపోతున్నారు.

సైన్స్ ఫిక్షన్ గా..

సైన్స్ ఫిక్షన్ గా..

శ్యామ్ సింగరాయ్ సినిమా తర్వాత నిహారిక ఎంటర్టైన్ మెంట్స్ నిర్మిస్తోన్న రెండో సినిమా ఇది. వెంకట్ బోయినపల్లి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ గా ఉండనుంది. ఇందులో 'చంద్రప్రస్త' అనే ఫిక్షనల్ పోర్ట్ ఏరియాను క్రియేట్ చేసినట్లు సమాచారం.

హిట్ 1లో నటించిన..

హిట్ 1లో నటించిన..

ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్ధీన్ సిద్ధిఖీ కీలక పాత్ర పోషిస్తున్నట్లు అధికారికంగా జనవరి 26న ప్రకటించారు. ఇప్పుడు తాజాగా ఇందులో యంగ్ హీరోయిన్ కీ రోల్ ప్లే చేయనున్నట్లు సమాచారం. హిమాచల్ ప్రదేశ్ ముద్దుగుమ్మ, చిలసౌ సినిమాలో నటించిన రుహానీ శర్మ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదివరకు శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన హిట్ 1లో రుహానీ శర్మ నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వెంకటేష్ సినిమాలోనూ ఆమెకు అవకాశం ఇచ్చారు డైరెక్టర్ శైలేష్ కొలను.

కీలక సన్నివేశాలు..

కీలక సన్నివేశాలు..

అయితే బ్యూటిఫుల్ ముద్దుగుమ్మ రుహానీ శర్మ సైంధవ్ సినిమాలో హీరోయిన్ పాత్ర కాదని సమాచారం. ఇందులో గ్లామర్ కంటే నటనకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్ర అని టాక్ వినిపిస్తోంది. మార్చి నెలాఖరులో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందనట. వెంకటేష్, రుహానీ శర్మతోపాటు ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చిత్రం వెంకేష్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా కానుందని సమాచారం.

హిందీ ప్రేక్షకులను..

ఇక వెంకటేష్.. రానాతో కలిసి రానా నాయుడు వెబ్ సిరీస్ లో నటించిన విషయం తెలిసిందే. వెంకటేష్, రానా దగ్గుబాటి తండ్రీ కొడుకులుగా నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ ప్రముకు ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో మార్చి 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇదే కాకుండా సల్మాన్ ఖాన్ తో కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమాతో హిందీ ప్రేక్షకులను అలరించేందుకు వెంకటేష్ సిద్ధంగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X