ఏడుస్తూ సదా వీడియో.. వాళ్లందరినీ టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు.. మీకా అర్హత లేదు!

జయం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తర్వాత.. విక్రమ్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన అపరిచితుడు సినిమాలో నటించి క్రేజ్ తెచ్చుకున్నారు హీరోయిన్ సదా.. ప్రస్తుతం టీవీ షోలకు జడ్జ్‌గా కూడా వ్యవహరిస్తున్న ఆమె సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు

ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు

ఈ వీడియో మొదటినుంచి ఆమె కన్నీరు పెట్టుకుంటూనే ఉన్నారు. ఇక ఈ వీడియో పెట్టడానికి ముందు తాను చాలా ఆలోచించాను అని ఎందుకంటే ఇలాంటి వీడియో ఎంత బాధలో ఉన్నప్పుడు ఎప్పుడూ పెట్టలేదని అని చెప్పుకొచ్చారు.. ఇక ఈ వీడియో ఒక కుక్క గురించి అని ఆమె వెల్లడించారు.

దారుణం

దారుణం

ఇక వీడియోలో ఆమె పేర్కొన్న దాని ప్రకారం ఆమె అవని అనే ఒక కుక్క గురించి ఈ వీడియో చేశారు.. అది ఒక బ్రీడ్ డాగ్ అని పెంపుడు కుక్కలను కొనుక్కునేవాళ్లు దీని గురించి కచ్చితంగా వినాలి అని చెప్పుకొచ్చారు.. ఒక బ్రీడర్ దానిని కొనుక్కుని దానిచేత చాలా పిల్లలు పెట్టించి అమ్ముకున్నాడని ఇప్పుడు అది పిల్లలు కనలేని పరిస్థితుల్లో ఉందని తెలుసుకుని దాన్ని రెండు కాళ్ళు కట్టి డస్ట్ బిన్ లో పడేసాడు అని ఆమె పేర్కొన్నారు.

ఏమాత్రం అర్హత లేదు

ఏమాత్రం అర్హత లేదు

ఇదంతా తలుచుకుంటే చాలా కోపం వస్తుంది అని ఆ కోపంతో ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పుకొచ్చారు.. తాను తన ఫ్రెండ్స్ సహా పెంపుడు కుక్కలు పెంచుకునే వాళ్లందరికీ చెబుతున్నానని మీరు కుక్కలు కొనుక్కుంటూ జంతు ప్రేమికులు అని చెప్పుకోవడానికి ఏమాత్రం అర్హత లేదని ఆమె చెప్పుకొచ్చారు. ఇక ఇండియన్ బ్రీడ్స్ పెంచుకోవాలని, మీకు షో ఆఫ్ చేసుకోవాలని అనిపిస్తే ఏదైనా కారు మీద లేదా వేరే ఇతర సామాన్లు మీద పెట్టుబడి పెట్టుకోండి కానీ ఇలా చేయొద్దు అని ఆమె కోరారు.

హీరోయిన్స్ కూడా

హీరోయిన్స్ కూడా

ఈ మధ్య కాలంలో ప్రతి హీరోయిన్ కూడా ఏదో ఒక కుక్క పిల్లలు కొంటూ వాటి ఫోటోలు పెడుతూ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో సదా ఈ విధంగా కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారుతోంది.. నిజానికి ఆమె ఏ హీరోయిన్ లేదా ఏ మనిషిని టార్గెట్ చేసి కామెంట్ చేయకపోయినా ఇలా పెంపుడు కుక్కలు పెంచుతున్న అందరినీ టార్గెట్ చేసి కామెంట్ చేయడంతో కొంత మంది నెటిజన్లు హీరోయిన్స్ తో లింక్ పెడుతూ వీళ్ళందరూ కూడా బుద్ధి తెచ్చుకోవాలని కోరుతున్నారు.

Recommended Video

Nanda Kishore, Ushasri Exclusive Interview Part 4 | Narasimhapuram

దయ చేసి అర్ధం చేసుకోండి

మీరు కొనే ప్రతి కుక్క పిల్ల వెనుక దాని తల్లి బాధ ఉంటుందని దయచేసి అర్ధం చేసుకోవాలని ఆమె వెల్లడించింది. దయచేసి ఇక మీదట డబ్బు ఏదయినా ఉంటే దానిని కుక్కల మంచి చెడ్డల కోసం చూసే వారికి ఇవ్వాలని వెల్లడించారు. ఇక ఆమె కామెంట్స్ మీద ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X