Don't Miss!
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
- News AP Elections: నా కాళ్లు పట్టుకున్నావా లేదా ? పెద్దిరెడ్డికి కిరణ్ ఘాటు కౌంటర్.. !
- Finance Cerelac News: పేదదేశాల సెరెలాక్ ఉత్పత్తులో పంచదార..!! FSSAIకి నోటీసులు జారీ..
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
స్పెయిన్‌లో సమంత-నాగ చైతన్య లగ్జరీ వెకేషన్ ... ఖరీదైన మద్యం సేవిస్తూ!
Recommended Video
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండి పోతున్న నేపథ్యంలో సినిమా తారలంతా సమ్మర్ వెకేషన్ కోసం విదేశాలకు వెళుతున్నారు. కొందరు స్టార్స్ తమ సినిమా షూటింగులను యూరఫ్‌లో ప్లాన్ చేసుకున్నారు. 'మజిలీ' సక్సెస్ జోరులో ఉన్న టాలీవుడ్ కపుల్ సమంత, నాగ చైతన్య ప్రస్తుతం స్పెయిన్ దేశంలో సేద తీరుతున్నారు.
స్పెయిన్ వెకేషన్‌కు సంబంధించిన ఫోటోలను సమంత తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. తమ వెకేషన్ ఎంత లగ్జరీగా సాగుతుందో వెల్లడిస్తూ ఆమె కొన్ని ఫోటోలు షేర్ చేశారు. అక్కడ వివిధ పర్యాటక ప్రాంతాలు, రెస్టారెంట్లు తిరుగుతూ హ్యాపీ మూడ్‌లో కనిపించారు.
ఖరీదైన వైన్ సేవిస్తూ...
స్పెయిన్ అంటేనే వైన్ ఫ్యాక్టరీలకు పెట్టింది పేరు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అరుదైన వైన్ ఇక్కడ లభిస్తుంది. చైతన్య, సామ్ ఇక్కడి వైన్ టేస్ట్ చేస్తూ.... హ్యాపీ మూడ్ ఎంజాయ్ చేస్తున్నారు. కొన్ని రోజుల పాటు ఈ జంట ఇక్కడే గడిపేలా లాంగ్ టూర్ ప్లాన్ చేసుకున్నారు.
ఏకాంతంగా గడుపుతూ...
ఇండియాలో ఉన్న సమయంలో తరచూ సినిమా షూటింగులతో బిజీగా గడిపే ఇద్దరూ.... హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో బయటకు వెళ్లి ఏకాంతంగా గడపలేని పరిస్థితి. అందుకే తమ సినిమా షూటింగులన్నీ ముగించుకుని రొమాంటిక్‌గా గడిపేందుకు జంట పక్షుల్లా యూరఫ్ ఎగిరిపోయారు.
ప్రత్యేకమైన ఫుడ్ టేస్ట్ చేస్తూ...
యూరఫ్‌లో మాత్రమే దొరికే ప్రత్యేకమైన ఫుడ్ టేస్ట్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు ఈ సందర్భంగా సమంత సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తన జీవితంలోనే ది బెస్ట్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. సమంత వాలకం చూస్తుంటే త్వరలోనే ఓ శుభవార్త చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది.
అక్కినేని ఫ్యామిలీ మొత్తం యూరఫ్లోనే
కేవలం సమంత, నాగ చైతన్య మాత్రమే కాదు... నాగార్జున, అమల కూడా యూరఫ్లోనే గడుపుతున్నారు. ‘మన్మధుడు 2' షూటింగ్ ప్రస్తుతం పోర్చుగల్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో గెస్ట్ రోల్ చేస్తున్న సమంత షూటింగులో పాల్గొనడానికి ఇటీవలే అక్కడికి వెళ్లారు. అనంతరం స్పెయిన్ వెళ్లి నాగ చైతన్యతో వెకేషన్లో జాయిన్ అయ్యారు.
నాగ చైతన్య, సమంత
సినిమాల విషయానికొస్తే ఈ ఇద్దరూ జంటగా నటించిన ‘మజిలీ' చిత్రం ఇటీవల విడుదలై భారీ విజయం అందుకుంది. ప్రస్తుతం సమంత ‘ఓ బేబీ' సినిమాతో పాటు ‘మన్మధుడు 2'లో గెస్ట్ రోల్ చేస్తోంది. నాగ చైతన్య తన మేనమామ వెంకటేష్‌తో కలిసి ‘వెంకీ మామ' అనే చిత్రం చేస్తున్నారు. త్వరలో చై, సామ్ కలిసి మరో సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.