Yashoda release date: పాన్ ఇండియా మూవీతో సమంత.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకొనేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌తో ఉత్తరాది ప్రేక్షకులను మెప్పించిన సమంత.. మళ్లీ యశోద సినిమాతో ప్రేక్షకులను ఆలరించేందుకు సిద్దమవుతున్నారు. ఇక యశోద సినిమా రిలీజ్, యూనిట్ విషయానికి వస్తే..
యశోద చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. హరీష్, హరి జంట దర్శకులుగా తెలుగు సినిమాకు పరిచయమై రూపొందించారు. ఈ చిత్రానికి ఎం శరత్ కుమార్ సినిమాటోగ్రఫిని అందిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించారు. ఈ చిత్రానికి పులగం చిన్నారాయణ, చల్లా భాగ్యలక్ష్మి మాటలు అందించారు.

తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతున్న యశోద చిత్రంలో సమంతతోపాటు ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, దివ్య శ్రీపాద తదితరులు నటిస్తున్నారు.
ఇటీవల విడుదలైన యశోద చిత్రం టీజర్ భారీ రెస్పాన్స్ అందుకొన్నది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో అంచనాలకు తగినట్టే యశోద సినిమాను 2023, నవంబర్ 11న రిలీజ్ చేసేందుకు నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ సిద్దమవుతున్నారు.


Click it and Unblock the Notifications











