Samantha Ruth Prabhu: సమంత శాకుంతలం సినిమాకు మరో షాక్.. మళ్ళీ వాయిదా..
సీనియర్ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం సినిమా మరోసారి వాయిదా పడినట్లుగా ఇటీవల కొన్ని కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే మొత్తానికి ఆ విషయంలో చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం సినిమాలో సమంత కథానాయకగా నటించారు. ఇక మణిశర్మ సంగీతం అందించగా ఇప్పటికే రెండు పాటలకు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.
ఇక ఈ సినిమా కోసం సమంత ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. సినిమాలో కంటెంట్ బాగా నచ్చడంతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ఈ సినిమా భాగస్వామ్యంలో ఒకరిగా చేరారు. ఈ కంటెంట్ పై గుణశేఖర్ అయితే చాలా నమ్మకంతో ఉన్నాడు. తప్పకుండా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని గతంలో ఆయన పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. అయితే ఇటీవల మళ్ళీ ఆ ప్రాజెక్టు వాయిదా పడినట్లుగా తెలుస్తోంది.

అసలైతే ఫిబ్రవరి 17వ తేదీన శాకుంతలం సినిమా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు విడుదల చేయడం లేదని ప్రొడక్షన్ హౌస్ నుంచి అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. కొన్ని కారణాల వలన ఈ సినిమాని ఫిబ్రవరి 17న విడుదల చేయలేకపోతున్నామని చెబుతూ.. తప్పకుండా ఈ సినిమాను మళ్ళీ వీలైనంత త్వరగా థియేటర్లో విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తాము అని దిల్ రాజుతో పాటు గుణశేఖర్ టీమ్ సభ్యులు కూడా క్లారిటీ ఇచ్చారు.
ఈ సినిమాకు సంబంధించిన దాదాపు అన్ని పనులు కూడా ముగిసినట్లుగా తెలుస్తోంది. అయితే ఫైనల్ గా మరి కొన్ని రోజుల్లో రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టాలని అనుకున్నారు. ఇప్పటికే గుణశేఖర్ కొన్ని ప్రత్యేకమైన ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు మళ్ళీ వాయిదా పడడంతో ఆ హడావిడి మొత్తం తగ్గిపోయినట్లు తెలుస్తోంది. ఇక మళ్ళీ పర్ఫెక్ట్ డేట్ చూసుకొని ఈ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. మరి ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











