నటి శరణ్య ఇంట్లో తీవ్ర విషాదం.. అర్ధరాత్రి కళ్ళముందే సన్నిహితుడి ప్రాణాలు

టాలీవుడ్ లోనే కాకుండా తమిళ్ మలయాళంలో పలు సినిమాలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న నటి శరణ్య. తెలుగులో స్టార్ హీరోలందరికి ఆమె తల్లిగా నటించారు. వేదం సినిమాలో ఆమె చేసిన పాత్రకు మంచి గుర్తింపు దక్కించుకున్నారు. అయితే ఇటీవల ఆ నటి ఇంట్లోనే ఒక మరచిపోలేని తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. కళ్ళ ముందే తనకి ప్రాణమైన వ్యక్తి ప్రాణాలు విడువడం ఆమెని ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది.

Recommended Video

Chit Chat with Crazy Crazy Feeling Movie Heroine Palak Lalwani | Filmibeat Telugu
ఆయన మరణంతో శరణ్య షాక్..

ఆయన మరణంతో శరణ్య షాక్..

నటి శరణ్య ఫ్యామిలీ సినిమా ఇండస్ట్రీకి చాలా దగ్గరగా ఉంటుంది. ముఖ్యంగా ఆయన తండ్రి మలయాళం తమిళ్ ఇండస్ట్రీలలో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన పేరు ఆంటోనీ భాస్కర్ రాజ్. సీన్హాల భాషలో కూడా కొన్ని సినిమాలను డైరెక్ట్ చేశారు. మొత్తంగా 70కి పైగా సినిమాలను తెరకెక్కించిన ఆయన ఇటీవల హఠాత్తుగా మరణించారు. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.

మొదట భర్తతో విడిపోయినప్పుడు..

మొదట భర్తతో విడిపోయినప్పుడు..

శరణ్యకు తండ్రి రాజ్ అంటే పంచ ప్రాణాలు. 95ఏళ్ల వయసులో ఉన్న రాజ్ కి ఇద్దరు కుమారులు కూడా ఉన్నప్పటికీ కూతురు దగ్గరే ఉండడానికి ఆయన ఎక్కువగా ఇష్టపడ్డారు. ఆయన వయసు పైబడడంతో తండ్రిని ఒక కొడుకు లాగా భావించి ఆమె ఇన్నాళ్లు సేవలు అందించింది. మొదట భర్త విడాకులు ఇచ్చినప్పుడు శరణ్యకు తండ్రి మద్దతు తప్పితే మరెవరి సపోర్ట్ కూడా ఆమెకి లబించలేదు.

అర్ధరాత్రి ఇంట్లోనే..

అర్ధరాత్రి ఇంట్లోనే..

కష్టాల్లో నిత్యం తోడుగా ఉన్న శరణ్యకి తండ్రి అంటే అమితమైన ప్రేమ. అయితే అలాంటి ఇష్టమైన వ్యక్తి ఆదివారం తన ఇంట్లోనే అర్ధరాత్రి ప్రాణాలు విడువడంతో ఆమె తీవ్ర స్థాయిలో మనోవేదనకు గురయ్యారు. తండ్రితో ప్రతిరోజు కొంత సేపు మాట్లాడి గాని నిద్రపోని శరణ్య రాత్రి మాట్లాడుతూనే కన్నుమూశారని తమిళ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

శరణ్య ఇంట్లో విషాదఛాయలు

శరణ్య ఇంట్లో విషాదఛాయలు

చెన్నైలోని విరుగంబక్కమ్ లో ఉంటున్న శరణ్య స్వగృహంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఉదయాన్నే వారి కుటుంబ సభ్యులు కొందరు ఇంటికి చేరుకున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం మూడు గంటల తరువాత అంత్యక్రియలకు ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇక రాజ్ మృతిపట్ల సౌత్ ఇండియన్ స్టార్స్ సంతాపం తెలియజేస్తూ అయన ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X