Shalu Chourasiya: యువనటికి మళ్లీ వేధింపులు.. అసలు విషయం బయటపెట్టిన పోలీసులు!
ఇటీవల సెలబ్రిటీలపై దాడులు, వేధింపులు ఎక్కువయ్యాయి. కొంతమంది పలు కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మరికొందరి ఇతరులతో ముప్పు వాటిల్లుతుంది. ఇటీవలే బాలీవుడ్ దిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్, ధర్మేంద్రలకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. అయితే కొంతమంది సెలబ్రిటీలకు నిజంగా ఇలాంటి బెదిరింపులు రావడం, వేధింపులతో సతమతం అవుతుంటే మరికొంతమంది ఇలాంటి సంఘటనలు ఆధారంగా చేసుకుని పేరు తెచ్చుకోవాలని చూస్తున్నారు. అలాంటి ఘటన తాజాగా ఒకటి జరిగింది. ఆ వివరాల్లోకి వెళితే..

దాడికి పాల్పడినట్లు..
బ్యూటిఫుల్ నటి షాలు చౌరాసియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండేళ్ల క్రితం ఆమెపై హైదరాబాద్ కేబీఆర్ పార్కులో దాడి జరిగింది. పార్కులో ఆమె జాగింగ్ చేస్తుండగా.. ఓ అగంతకుడు దాడి చేశాడు. ఆమెను తీవ్రంగా కొట్టి రూ. 10 వేలు డిమాండ్ చేశాడు. తన వద్ద డబ్బులు లేవని, కావాలంటే పేటీఎమ్ చేస్తానని చెప్పినా అతను వినకుండా దాడికి పాల్పడినట్లు చౌరాసియా అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేబీఆర్ పార్కులో..
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి.. ఆమెపై దాడి చేసింది సినిమా సెట్లలో లైట్స్ వేసే వ్యక్తిగా గుర్తించారు. డబ్బు కోసమే అతడు దాడి చేసినట్లు తేలింది. నిందితుడు బాబును అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అయితే తాజాగా ఆమె మరోసారి ఇలానే ఫిర్యాదు చేసింది. బంజారాహిల్స్ కేబీఆర్ పార్కులో జాగింగ్ చేస్తుండగా.. ఓ వ్యక్తి తనను ఫాలో అయ్యాడని ముద్దుగుమ్మ షాలు చౌరాసియా పోలీసులకు కంప్లయింట్ చేసింది.

అసలు విషయం..
బుధవారం రాత్రి 7 గంటల సమయంలో తాను జాగింగ్ చేస్తుండగా.. ఓ వ్యక్తి వెంబడించినట్లు తెలిపింది చౌరాసియా. భయంతో సెక్యూరిటీ సిబ్బందికి విషయం తెలియజేశానని వెల్లడించింది. చౌరాసియా ఫిర్యాదు తీసుకున్న ఫిర్యాదులు గతంలో కూడా ఆమెపై దాడి జరగడంతో విచారణ చేపట్టారు. సీసీ కెమెరాలా ఆధారంగా విచారణ చేపట్టి సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే బుధవారం రాత్రి జరిగిన అసలు విషయం బయటపెట్టారు.

గతంలో కూడా ఓసారి..
యువనటి షాలు చౌరాసియా వెంట ఎవరు పడలేదని.. పోలీసులు నిర్ధరించారు. అతడు కూడా జాగింగ్ కోసమే వచ్చాడని తెలిపారు. సీసీ కమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా విచారించినట్లు వాళ్లు వెల్లడించారు. సదరు వ్యక్తి గురించి పూర్తి వివరాలు తెలుసుకుని అతన్ని వదిలేసినట్లు తెలిపారు. గతంలో కూడా ఓసారి చౌరాసియాపై దాడి జరగడంతో ఆ భయంలో ఉన్న ఆమె సదరు వ్యక్తి అనుమానాస్పదంగా ఉండటంతో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

పబ్లిక్ స్టంట్..
నటి చౌరాసియాకు ఈ విషయంపై కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినట్లు బంజారాహిల్స్ పోలీసులు వెల్లడించారు. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఈ సంఘటనపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. అంతేకాకుండా యువనటి షాలు చౌరాసియా కేవలం ఫేమ్ సంపాదించుకోవడానికే ఇలాంటి పబ్లిక్ స్టంట్స్ వేస్తుందని విమర్శిస్తున్నారు.


Click it and Unblock the Notifications











