ఏపీ రాజకీయాల్లోకి శృంగార తార.. వైసీపీ టికెటిస్తే గెలిచి చూపిస్తా.. వైఎస్ జగన్‌కు రిక్వెస్ట్!
తెలుగు సినిమా పరిశ్రమలో శృంగార తారగా పేరు తెచ్చుకొన్న ఫ్యాషన్ డిజైనర్, క్యాస్టూమ్ డిజైనర్ శ్రీ రాపాక ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నారు. రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన నెకెడ్ నంగా నగ్నం అనే సినిమా ద్వారా ఆమె సంచలనం రేపారు. అయితే ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించనప్పటికి పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. అయితే రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే కోరిక ఉందని ఏపీ సీఎంకు విన్న వించుకొన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ...
నా పేరే శ్రీ రాపాక. మాది రామన్నపాలెం. దేవరపల్లి మండలం. గోపాలపురం నియోజకవర్గం. ఇంతకు ముందు నేను తెలుసు. చిన్న తనంలో ఒక్కడే చదువుకొన్నాను. నా గురువు ప్రోత్సాహంతో ఖోఖో, వాలీబాల్, కబాడ్డీ క్రీడల్లో నేషనల్ లెవెల్‌లో పార్టిసిపేట్ చేశాను. పదిసార్లు జాతీయ స్థాయిలో ప్రాతినిథ్యం వహించాను. ఆ తర్వాత ఫ్యాషన్ డిజైనర్‌గా సినిమాల్లో పనిచేశారు. దాదాపు 50కి పైగా తెలుగు, కన్నడ సినిమాలకు పనిచేశాను. ఓ సినిమాలో హీరోయిన్‌గా నటించాను అని శ్రీరాపాక చెప్పారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యువ, రాజకీయాలపై ఆసక్తి ఉన్న ఔత్సాహికులకు, కొత్త వాళ్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అవకాశం ఇస్తున్నారు. నేను పదేళ్లుగా సామాజిక సేవలో నిమగ్నమయ్యాను. రాజకీయాల్లోకి వస్తే.. ఇంకా ఎన్నో సేవలు చేయగలననిపించింది. పవర్ ఉంటే ఇంకా బాగా చేయొచ్చు. అభివద్ది చేయవచ్చు అనేది నా అభిప్రాయం అని శ్రీ రాపాక అన్నారు.
ప్రజలకు సేవ చేయాలనే తపనను, ఉత్సాహాన్ని చూసి సీఎం జగన్ గారు నాకు సీటు ఇస్తే.. గోపాలపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుస్తాను. గోపాలపురం ప్రజలకు అందుబాటులో ఉంటి.. ప్రజా సేవ చేయాలని ఉంది. నా నియోజకవర్గంలో సంక్షేమ పథకాలను అమలు చేసి అభివృద్ధి చేయాలని ఉంది అని శ్రీ రాపాక తెలిపారు.

ప్రభుత్వం నిధులతోనే కాకుండా నాకు ఉన్న సినీ పరిచయాలతో విరాళాలు సేకరించి నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తాను. కాబట్టి నా తపన గుర్తించి సీఎం జగన్ నాకు సీట్ ఇవ్వాలని కోరుకొంటున్నాను. మళ్లీ జగన్ గెలిచి సీఎం పదవిని చేపట్టాలని కోరుకొంటున్నాను అని శ్రీ రాపాక చెప్పారు.
శ్రీ రాపాక వ్యక్తిగత విషయానికి వస్తే.. విద్యార్థి దశలో క్రీడాకారిణిగా రాణించారు. సెంట్రల్ యూనివర్సిటీ నుంచి పీజీ చేశారు. కిరాక్ కబాడ్డీ అనే షో ద్వారా టెలివిజన్ రంగంలోకి ప్రవేశించారు. జెమినీ టెలివిజన్‌లో రంగస్థలం సీరియల్ చేశారు. అలాగే జబర్దస్త్ షోలోను, బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ 1లో కూడా పాల్గొన్నారు. మరణం, మిషన్ 2020 చిత్రాల్లో నటించారు.


Click it and Unblock the Notifications











