For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  శ్రీదేవి అతిలోక సుందరి.. ఆమె లేని లోటు తీర్చలేనిది.. అందాల భామ శ్రీయ

  |

  సంతోషం సినీ వారపత్రిక 17వ వార్షికోత్సవం, సంతోషం సౌత్‌ ఇండియా ఫిల్మ్‌ అవార్డ్స్‌ 2019 ప్రదానోత్సవం చిత్రసీమ అతిరథ మహారథుల సమక్షంలో, వేలాది మంది ప్రేక్షకుల మధ్య అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా జరిగింది. హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఆదివారం సాయంత్రం నిర్విరామంగా 6 గంటకు పైగా సాగిన ఈ వేడుకలో తారల ప్రసంగాలు, డాన్స్‌ పర్ఫార్మెన్స్‌లు, సరదా స్కిట్‌లు హైలైట్‌గా నిలిచాయి.

  అలనాటి తార జమున, ప్రభ, రోజారమణి, నటిదర్శకురాలు జీవిత, నటులు రాజేంద్రప్రసాద్‌, రాజశేఖర్‌, బాబూమోహన్‌, సునీల్‌, వెన్నెల కిశోర్‌, ఎస్వీబీసీ చైర్మన్‌ పృథ్వీరాజ్‌, కార్తికేయ, రాంకీ, విష్వక్‌సేన్‌, నేటి తారలు శ్రియ, శివానీ, శివాత్మిక, నటాషా దోషి, అవికా గోర్‌, దీప్తి సునయన, ప్రముఖ నిర్మాతలు డి. సురేశ్‌బాబు, అల్లు అరవింద్‌, అంబికా కృష్ణ, దిల్‌ రాజు, తమిళ హీరో జయం రవి, కన్నడ నటుడు, ఇండియన్‌ మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌, తమిళ వెటరన్‌ యాక్ట్రెస్‌ కుట్టి పద్మిని, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, సంగీత దర్శకుడు తమన్‌, గాయకుడు అనురాగ్‌ కులకర్ణి తదితరులు ఈ వేడుకకు అమితమైన ఆకర్షణ తీసుకొచ్చారు.

  Actress Shriya recalls Sridevis bueaty in Santosham South Indian Film Awards

  జమున చేతుల మీదుగా సీనియర్‌ నటి, నర్తకి ప్రభ లెజెండరీ యాక్ట్రెస్‌ అవార్డు అందుకున్నారు. ఆమె మాట్లాడుతూ ''ఎవరికైనా సగం బలం సంతోషమే.. ఇన్నేళ్లుగా ఈ వేడుక నిర్వహిస్తూ మన సురేష్‌ ఎన్ని పాట్లు పడుతున్నాడో! అందరితో కలిసి మెలిసి ఉంటూ ఇలాంటి పెద్ద కార్యక్రమం చేస్తున్నాడంటే సినీ పెద్దలందరి సహకారమే కారణం. తన సంతోషాన్ని మాలాంటి ఆర్టిస్టుతో పంచుకుంటున్న సురేష్‌కు ధన్యవాదాలు. ఆర్టిస్టుకు ఇలాంటి ఎంకరేజ్‌మెంట్‌ ఉంటే చాలా ఉత్సాహంగా పని చేస్తాం. ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా'' అన్నారు.

  అల్లు రామలింగయ్య అవార్డును అల్లు అరవింద్‌ చేతుల మీదుగా అందుకున్న వెన్నెల కిశోర్‌ మాట్లాడుతూ ''మామూలుగా ఒక అవార్డు తీసుకెళ్లినప్పుడు.. నా పేరు చూసి హ్యాపీగా ఫీలయ్వేవాడిని. కానీ ఈ అవార్డుపై అల్లు రామలింగయ్యగారి పేరు చూసి ఇంట్లో గర్వంగా ఫీలవుతారు. ఈ అవార్డును నా రచయితలకు, దర్శకులకు అంకితమిస్తున్నా. నేను ఈ జన్మకు హీరోగా చేయను. హీరో ఫ్రెండ్‌గా చాలు. హీరో అవ్వాలంటే దానికి అర్హత కావాలి. ఆ క్వాలిఫికేషన్‌ లేదు. బాడీ ఔటాఫ్‌.. ఫుడ్‌ త్యాగం చేయలేను'' అని నవ్వించారు.

  డి. రామానాయుడు స్మారక అవార్డును సురేశ్‌బాబు చేతుల మీదుగా అందుకున్న దిల్‌ రాజు ''ఒక జర్నలిస్ట్‌గా మొదలై.. ఇంతమందికి అవార్డు ఇచ్చే స్థాయికి ఎదిగిన సురేష్‌కు అభినందనలు. ఇది మామూలు ఫీలింగ్‌ కాదు.. 'శతమానంభవతి'కి జాతీయ అవార్డు వచ్చినప్పుడు ఎలా ఫీలయ్యానో.. ఈ అవార్డుకు కూడా అలా ఫీలవుతున్నా. రామానాయుడుగారి సినిమాలు నాకు గ్రేట్‌ ఇన్‌స్పిరేషన్‌. ఆయన అవార్డు సురేశ్‌ బాబుగారి చేతుల మీదుగా తీసుకోవడం సంతోషంగా ఉంది'' అన్నారు.

  'అరవింద సమేత'లో నటనకు గాను నిర్మాత అంబికా కృష్ణ చేతుల మీదుగా ఉత్తమ హాస్యనటునిగా పురస్కారం అందుకున్న సునీల్‌ మాట్లాడుతూ.. ''సంతోషం సురేష్‌కి థాంక్స్‌. ఈ అవార్డు వచ్చినందుకు నిర్మాణ సంస్థ హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌కు, డైరెక్టర్‌ త్రివిక్రమ్‌కు, ఎన్టీయార్‌కు ధన్యవాదాలు. ఈ అవార్డును వేణుమాధవ్‌ గారికి అంకితమిస్తున్నా'' అని చెప్పారు.

  డాక్టర్‌ రాజశేఖర్‌, జయం రవి చేతుల మీదుగా శ్రీదేవి స్మారక అవార్డును శ్రియ అందుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. శ్రీదేవి మేడం పాటలు ఎప్పుడూ వింటూ ఉంటా. ఆమె అందరికీ ఇన్సిపిరేషన్‌. మా అమ్మ ముందు ఈ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు చాలా స్పెషల్‌ అవార్డు. మరిన్ని మంచి సినిమాలతో మిమ్మల్ని అలరించడానికి ప్రయత్నిస్తా'' అన్నారు.

  రాజశేఖర్‌ మాట్లాడుతూ.. ''శ్రీదేవి గారి పేరిట ఒక అవార్డు.. మా చేతుల మీదుగా ఇవ్వడం ఆనందంగా ఉంది. శ్రీదేవి గారు ఎంతమంచి యాక్టరో శ్రియ కూడా అంతమంచి యాక్టర్‌. శ్రియలో శ్రీదేవి గారి పోలికలు ఉంటాయి. అలాగే మా పెద్దమ్మాయిలో కూడా శ్రీదేవి గారి పోలికలు ఉంటాయి. సురేష్‌ గారు 17 ఏళ్లుగా ఈ వేడుకలు చేస్తున్నారు. నన్ను ఎన్నోసార్లు పిలిచారు. నేను సంతోషం అవార్డ్స్‌ ఈవెంట్‌కు రావడం ఇదే తొలిసారి. సంతోషం సురేష్‌ గారికి కంగ్రాట్స్‌'' అన్నారు.

  జీవిత మాట్లాడుతూ.. ''శ్రీదేవి గారి గురించి మాట్లాడ్డానికి మాటలు చాలవు. ఆమె అతిలోక సుందరి. ఆమెకు రీప్లేస్‌ మెంట్‌ లేదు. ఈ అవార్డు శ్రియకు ఇవ్వడం 100 శాతం కరెక్ట్‌'' అన్నారు.

  English summary
  Santhosham South Indian Film Awards held on September 29th in Hyderabad. In this function, Actress Shriya recalls Sridevi's bueaty.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X