Actress Snigdha: "చిన్నప్పుడే నాపై అత్యాచారయత్నం.. తండ్రి, మామ పక్కన పడుకున్నా వణుకే"

టాలీవుడ్ టామ్ బాయ్, నటి స్నిగ్ధ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మాయి అయిన ఈమె ఎప్పుడూ జీన్స్ వేసుకుంటూ.. అబ్బాయిలా మెదులుతుంటుంది. అలాంటి గెటప్స్ లోనే సినిమాలు కూడా చేస్తూ తన టాలెంట్ ప్రూవే చేసుకుంటుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తనపై జరిగిన అత్యాచార యత్నం గురించి తొలిసారి నోరు విప్పింది. అప్పటి నుంచి తనకు తండ్రి, మామ పక్కన పడుకున్నా.. వణుకు వచ్చేస్తుందని, నిద్ర కూడా పట్టదని తెలిపింది. ఈ విశేషాలు ఏంటో మన ఇప్పుడు తెలుసుకుందాం.

2011లో నటి నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అలా మొదలైంది సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిందీ ముద్దుగుమ్మ. టామ్ బాయ్ లా కనిపిస్తూ.. తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యక స్థానాన్ని సంపాదించుకుంది. ముఖ్యంగా ఈమె టాలెంట్ గుర్తించిన దర్శక, నిర్మాతలు ఈమెకు చాలానే సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు. అలా స్నిగ్ధ.. మేం వయసుకు వచ్చాం, రొటీన్ లవ్ స్టోరీ, దమ్ము, ఒక్కడినే, టైగర్, జత కలిసే, గుంటూరు టాకీస్, కల్యాణ వైభోగమే, కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి చిత్రాల్లో చేసింది.

Actress Snigdha First Time Revealed Rape Attempt on Her Check Details

ముఖ్యంగా 2015లో వచ్చిన జత కలిసే సినిమాకు ఉత్తమ హాస్యనటి కేటగిరీలో నంది పురస్కారం కూడా వచ్చింది. ఇలా అద్భుతమైన టాలెంట్ కల్గిన ఈమె తాజాగా రీతూ చౌదరి యాంకర్ గా చేస్తున్న దావత్ అనే షోకు వచ్చింది. అక్కడే తనకు సంబంధించిన అనేక షాకింగ్ విషయాలను వెల్లడిచింది. తన తల్లిదండ్రులు, ఫ్యామిలీ వివరాలతో పాటు చిన్నప్పుడు తనపై జరిగిన హత్యాచారయత్నం గురించి కూడా వివరించింది. ఇలా తొలిసారి తనపై అత్యాచారం గురించి చెప్పగా.. అంతా షాక్ అవుతున్నారు.

స్నిగ్ధ చిన్నప్పుడే ఎవరో తనను ఎత్తుకెళ్లి అత్యాచారం చేయబోగా.. గట్టిగా తన్నేసి, పారిపోయి ఇంటికి చేరుకున్నట్లు వివరించింది. అయితే అప్పటి నుంచి తనకు చాలా భయం పట్టుకుందని.. దాదాపు 10 సంవత్సరాలు తాను ఎరితోనూ కలవలేకపోయానని, లోపల ఆ భయం కూడా అలాగే ఉండిపోయిందని వెల్లడించింది. ఆ ఘటన జరిగిన తర్వాత నుంచి తన తండ్రి, మామయ్య పక్కన పడుకున్నా భయం వేస్తుందని.. రాత్రంతా నిద్ర కూడా పట్టదని చెప్పింది. తనను ప్రాణంగా చూసుకునే వాళ్లతో కూడా తాను సరిగ్గా ఉండలేని స్థితికి రావడానికి కారణం ఆ అత్యాచారయత్నమే అని స్పష్టం చేసింది.

Actress Snigdha First Time Revealed Rape Attempt on Her Check Details

అలాగే తన జీవితంలో రీగ్రెట్ అయ్యే విషయం ఏదైనా ఉందంటే.. తన తల్లి గురించేనని చెప్పింది. ఒకరోజు తన తల్లి ఫోన్ చేసి ఇంటికి రమ్మని పదే పదే చెప్పగా.. వీకెండ్ లో వస్తానని టికెట్స్ కూడా బుక్ చేసుకున్నట్లు చెప్పింది. కానీ తాను ఇంటికి వెళ్లేలోపే తన తల్లి చనిపోయిందని.. కనీసం రమ్మన్నప్పుడే వెళ్లి ఉంటే తనతో చాలా సమయం గడిపేదానన్ని.. ఇప్పటికీ ఎందుకు వెళ్లలేనా అని గిల్టీగా ఫీల్ అవుతానంటూ వెల్లడించింది. ప్రస్తుతం దావత్ షోకు సంబంధించిన ప్రోమోలోనే ఇన్ని విషయాలు ఉండగా.. ఇక పూర్తి ఎపిసోడ్ చూస్తే మరిన్ని విషయాలు తెలిసే ఛాన్స్ ఉంది. సో డోంట్ మిస్ ఇట్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X