Actress Snigdha: 43 ఏళ్లు వచ్చినా నేనింకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే!
టాలీవుడ్ క్యూట్ బ్యూటీ నటి స్నిగ్ధ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అచ్చమైన అమ్మాయి అయిన ఈమె అబ్బాయిలా రెడీ అవుతూ... సినిమాలు చేస్తుంది. కేవలం టామ్ బాయ్ లా కనిపించే పాత్రలు మాత్రమే చేస్తే ఫుల్ క్రేజ్ సంపాధించుకుంది. అయితే ప్రస్తుతం 43 ఏళ్ల వయసులో ఉన్న ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలను తొలిసారి రివీల్ చేసింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1981వ సంవత్సరం జనవరి 15వ తేదీన జన్మించిన ఈమె 2011లో సినీ రంగంలోకి అడుగు పెట్టింది. ముఖ్యంగా నందినీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అలా మొదలైంది సినిమాలో పింకీగా కనిపించి మెస్మరైజ్ చేసింది. తొలి చిత్రంతోనే విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఆ తర్వాత కూడా అదిరిపోయే సినిమాలు చేసింది. మేం వయసుకు వచ్చాం, రొటీన్ లవ్ స్టోరీ, దమ్ము, ఒక్కడినే, టైగర్, జత కలిసే, గుంటూర్ టాకీస్, కల్యాణ వైభోగమే, కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. కెరియర్ లో మంచి పాత్రలు దక్కించుకుంటూ ముందుకు వెళ్తున్న ఈమె పర్సనల్ లైఫ్ లో మాత్రం ముందుకు వెళ్లట్లేదు.

అంటే 43 ఏళ్ల వయసు వచ్చినా ఆమె ఇంకా పెళ్లి చేసుకోవట్లేదు. అయితే తొలిసారి తను ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలను వివరించింది. తనకు తెలిసిన, చాలా క్లోజ్ గా ఉండే ఓ నరుగురైదుగురు తనను పెళ్లి చేసుకుంటామని చెప్పారని... నేరుగా ఇంట్లో వాళ్లతో మాట్లాడారని వివరించింది. కానీ ఎందుకో తనకు వాళ్లను పెళ్లి చేసుకోవాలనిపించలేదని... ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నానని వివరించింది.
అయితే తనకు ఏదైమా సమస్య ఉందేమో అని భావించిన.. తన స్నేహితులు(పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్లు) తనను సైకియాట్రిస్ట్ దగ్గరకు కూడా తీసుకెళ్లారని వివరించింది. గతంలో అంటే చిన్నతనంలో తనపై అత్యాచార యత్నం జరగడంతో.. తనకు పెళ్లి అన్నా, మగాళ్లు అన్నా భయం ఏర్పడిందేమే అనుకుని వాళ్లు అలా చేశారని క్లారిటీ ఇచ్చింది. అయితే దానికి పరిష్కారం దొరకలేదు కానీ.. తన మనుసులో భయం మాత్రం అలాగే ఉండిపోయిందని వెల్లడించింది. ఈ కారణం వల్లే తాను ఇంకా పెళ్లి చేసుకోలేదేమో అని చెప్పింది.

కానీ నిజంగా తన మనసుకు నచ్చిన అబ్బాయి వస్తే మాత్రం కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని నటి స్నిగ్ధ వివరించింది. వయసు ఎక్కువైనా తన మనసుకు నచ్చిన వాడు వస్తే.. మూడు ముళ్లు వేయించుకుంటానన్న స్నిగ్ధ.. తాను టామ్ బాయ్ లా ఉండడం వెనుక కథ కూడా చెప్పింది. తనకు ఆ బట్టలు చాలా కంఫర్ట్ గా అనిపిస్తాయని.. అందుకే అలాంటి బట్టలే వేసుకోవడం తనకు ఇష్టమని వివరించింది. తనకు నచ్చినట్లు తన లైఫ్ లీడ్ చేస్తూ ఒంటరిగానే జీవిస్తున్నట్లు వివరించింది.


Click it and Unblock the Notifications











