అది అలాంటి పాత్ర కాదు.. తప్పుగా ప్రచారం చేయకండని వేడుకున్న నటి
ఈ మధ్య కాలంలో టీజర్, ట్రైలర్‌తోనే సినిమా పరిస్థితి ఏంటని చెప్పేస్తున్నారు. అయితే అన్ని సార్లు అలా చెప్పడం వర్కౌట్ కాకపోయినా.. టీజర్, ట్రైలర్ ఇంపాక్ట్ మాత్రం భారీగానే ఉంటోంది. అయితే కొందరు మాత్రం వీటిని తెలివిగా కట్ చేసి ప్రేక్షకులను బుట్టలో వేసుకుని థియేటర్లకు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో టీజర్, ట్రైలర్‌లో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉండేలా కట్ చేస్తున్నారు.

తాజాగా ఓ ట్రైలర్..
మలయాళంలో పచ్చమాంగ అనే చిత్రం రాబోతోంది. ఈ మూవీలో నటి సోనా, ప్రతాప్ పోతన్ నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో ఆ నటికి సంబంధించిన బోల్డ్ సీన్స్‌ను కట్ చేసి పెట్టారు. అయితే అది చూసిన ప్రతీ ఒక్కరూ సినిమాను, ఆమె పాత్రను టార్గెట్ చేస్తున్నారు.

సీన్స్ వైరల్..
బెడ్ సీన్స్, బోల్డ్ సన్నివేశాలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. అంతేకాకుండా ఆమె ధరించిన దుస్తులు, కనబడిన విధానంతో ఆమె మలయాళ ఇండస్ట్రీకి మరో షకీలా దొరికిందని కామెంట్లు చేస్తున్నారు. అయితే వీటిపై వివరణ ఇస్తూ.. నటి సోనా తన బాధనంతా వెల్లగక్కింది.

అది అలాంటి పాత్ర కాదు..
ఈ రూమర్లపై స్పందిస్తూ.. పచ్చమాంగా ఒక బలమైన కథాంశంతో కూడిందని చెప్పుకొచ్చింది. బాలుమహేంద్ర చిత్రాల మాదిరిగా పక్కా క్లాస్ చిత్రమని పేర్కొంది. ఆ చిత్ర ట్రైలర్‌లో తాను ధరించిన దుస్తులు, కొద్ది పాటి సన్నివేశాలను చూసి శృంగార భరిత పాత్రలో నటించినట్లు భ్రమను కలిగిస్తున్నాయని తెలిపింది. అది అలాంటి పాత్ర కాదని వెల్లడించింది.

తప్పుగా ప్రచారం..
కేరళలో మహిళలు ఎలాంటి దుస్తులు ధరిస్తారో అలాంటివే ధరించినట్లు చెప్పుకొచ్చింది. తాను ధరించిన దుస్తులను బట్టి అది అలాంటి చిత్రమనో, శృంగార నటిననో చిత్రీకంచండని వేడుకుంది. పచ్చమాంగ అన్నది చాలా మంచి కథా చిత్రం అని చెప్పింది. తన పాత్ర కూడా బలమైందని, సినిమా విడుదలైన తరువాత ఈ విషయం అందరికీ అర్థమవుతుందని ఎంతో నమ్మకంగా చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











