ఎన్టీఆర్, కొరటాాల శివ మూవీలో చిరంజీవి హీరోయిన్.. అసలు విషయం ఏమిటంటే?
RRR సినిమా సక్సెస్ అనంతరం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో మరొక బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాను మొదలు పెట్టడానికి రెడీ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా మార్కెట్ కు తగ్గట్టు గానే బిగ్ బడ్జెట్ తో తెరపైకి రాబోతుంది. అయితే స్టార్ క్యాస్ట్ విషయంలో కూడా దర్శకుడు కొరటాల శివ అంచనాలకు తగ్గట్టుగానే ప్రముఖ నటీనటులు ను సెలెక్ట్ చేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇందులో అప్పట్లో చిరంజీవి తో నటించిన స్టార్ హీరోయిన్ ని కూడా ముఖ్యమైన పాత్ర కోసం సెలెక్ట్ చేసుకున్నారని వార్తలు వచ్చాయి. ఇక ఆ విషయం పై ఆ హీరోయిన్ కూడా స్పందించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఎన్టీఆర్ కాన్ఫిడెంట్
జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమా తో అన్ని భాషల్లో కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అయితే అందుకున్నాడు. తప్పకుండా తదుపరి సినిమాను కూడా అదే తరహాలో విడుదల చేసి సోలోగా తన మార్కెట్ను మరింత పెంచుకోవాలని చూస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా పై అయితే ఎన్టీఆర్ కాన్ఫిడెంట్ గానే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల విడుదలైన అనౌన్స్మెంట్స్ టీజర్ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది.

రెండవసారి అంతకుమించి
దర్శకుడు కొరటాల శివతో ఇదివరకే జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ అనే సినిమా చేశాడు. ఆ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు రెండవసారి వీరి కలయికలో రాబోయే సినిమా అంతకుమించి అనేలా ఉంటుంది అని చెబుతున్నారు. ముఖ్యంగా అతిపెద్ద కాన్వాస్ ఉన్న స్టోరీ అని.. ఇంతవరకు ఇలాంటి కథతో ఎన్టీఆర్ గానీ నేను గానీ రాలేదు అని దర్శకుడు వివరణ ఇచ్చాడు.

కాంప్రమైజ్ కాకుండా..
ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించిన బడ్జెట్ కూడా దాదాపు ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవాలని నిర్మాతలు ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఖర్చు చేయడానికి ఆలోచిస్తున్నారు. ఈ సినిమా కోసం 250 కోట్ల వరకు ఖర్చు చేసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా నటీనటుల విషయంలోనే ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా భారీ తారాగణం తో సినిమాను తెరపైకి తీసుకు వచ్చే అవకాశం ఉందట.

పవర్ఫుల్ పాత్ర కోసం మెగాస్టార్ హీరోయిన్
అయితే ఒక ముఖ్యమైన పాత్ర కోసం మాజీ హీరోయిన్ ను గతంలో సంప్రదించినట్లు కథనాలు వెలువడ్డాయి. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర , శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలలో నటించిన సోనాలి బింద్రే ఎన్టీఆర్ 30వ సినిమాలో ఒక పవర్ఫుల్ పాత్రలో నటించనుందని, ఆమెకు కొరటాల శివ స్టోరీ కూడా చెప్పి ఒప్పించారని టాక్ వచ్చింది.

కొరటాల శివ ఏమన్నాడంటే?
ఇక మరో వైపు దర్శకుడు కొరటాల శివ కూడా సినిమా పై వస్తున్న రూమర్స్ అన్నిటికీ కూడా ఒకే ఒక్క మాటతో చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. పూర్తి కథ అయితే సిద్ధం అయింది ఇంతవరకు కాస్టింగ్ విషయంలో తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని అన్నారు. కథ రెడీ అయిన తర్వాత ఎన్టీఆర్ కు చెప్పడం జరిగింది అని అంతకుమించి ఏ విషయంలోను ముందుకు సాగలేదు అని కూడా అన్నారు. మొన్నటి వరకు ఈ సినిమాలో అలియా భట్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం కొరటాల శివ జాన్వికపూర్ పై కూడా ఫోకస్ చేసే ఆలోచనలో ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. మరి ఈ విషయంలో దర్శకుడు ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











