ప్రముఖ హీరోయిన్ తండ్రిపై కత్తితో దాడి.. అభిమానే దారుణానికి ఒడిగట్టి..
బాలీవుడ్ నటి సోనాలి కులకర్ణికి షాకింగ్ సంఘటన ఎదురైంది. తన తండ్రిని ఆయన నివాసంలో సోనాలి అభిమాని వ్యక్తి కత్తితో దాడి చేశారు. ఈ దారుణ ఘటనలో ఆయనకు స్వల్పంగా గాయాలు అయ్యాయి. దాడి సందర్భంగా తీవ్రంగా పెనుగులాట, తోపులాట జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
పోలీసుల తెలిపిన ప్రకారం.. సోనాలి కులకర్ణి తండ్రిపై ఆమె అభిమాని దాడి చేశాడు. అతడిని అజయ్ షెగ్టేగా గుర్తించాం. ఇంటి పైపు ద్వారా టెర్రస్‌పైకి వెళ్లాడు. ఆ సమయంలో పనిమనిషి చూడటంతో సొనాలి తండ్రికి అభిమానికి తోపులాట జరిగింది. ఆ క్రమంలో కత్తితో దాడి చేశాడు.

నిందితుడిని పోలీసులు ప్రశ్నిస్తూ సమాచారాన్ని రాబడుతున్నామన్నారు. ఈ దాడి వెనకు అసలు కారణం దొంగతనమే అని నిర్ధారణకు వచ్చామని పోలీసులు తెలిపారు. అతడిపై కేసు నమోదు చేసి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు అని అధికారి తెలిపారు.
ఇటీవలే నటి సోనాలి కులకర్ణి వివాహం జరిగింది. దుబాయ్‌లోని చార్టెట్ అకౌంటెంట్ కునాల్ బెనోడేకర్‌తో వివాహం మే నెల తొలి వారంలో జరిగింది. ప్రస్తుతం భర్తతోనే సోనాలి ఉంటున్నట్టు తెలిసింది.


Click it and Unblock the Notifications











