అతను తగ్గడు.. బన్నీతో డాన్స్ చేయాలంటే .. నిజాలు బయటపెట్టిన శ్రీలీల..!
అల్లు అర్జున్.. తెలుగు చిత్ర పరిశ్రమలో డ్యాన్స్ అద్భుతంగా చేయగల హీరోల్లో ఒకరు. ఎంతటి క్లిష్టమైన మూవ్‌మెంట్స్‌ని అయినా చాలా ఈజ్‌గా చేసేస్తారు బన్నీ. ఆయన డ్యాన్స్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. హీరోయిన్లు సైతం అల్లు అర్జున్‌తో డ్యాన్స్ చేయాలంటేనే భయపడతారంటే అతిశయోక్తి కాదు. తాజాగా బన్నీతో డ్యాన్స్ చేయాలంటే చాలా కష్టమని అన్నారు స్టార్ హీరోయిన్ శ్రీలీల. ఈ వివరాల్లోకి వెళితే..
సరిగ్గా మూడేళ్ల క్రితం ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప ది రైజ్ ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. పాటలు, మాటలు, డైలాగ్స్, నటీనటుల నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దీంతో పుష్ప పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ చిత్రాల లిస్ట్‌లో స్థానం దక్కించుకుంది. అందుకే దీనికి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న పుష్ప 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

డిసెంబర్ 5వ తేదీన పుష్ప2ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఇంతటి భారీ హైప్ ఉన్న నేపథ్యంలో పుష్ప ది రూల్‌కి రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. థియేట్రికల్ రైట్స్ కింద ఏకంగా రూ. 640 కోట్లు, డిజిటల్ రైట్స్ రూ. 275 కోట్లు, మ్యూజిక్ రైట్స్ రూ.65 కోట్లు, శాటిలైట్ రైట్స్ రూ.85 కోట్లు కలుపుకుని మొత్తంగా రూ. 1065 కోట్ల వ్యాపారంతో పుష్పరాజ్ రికార్డుల దుమ్ముదులిపాడు.

అలాగే గతంలో ఏ భారతీయ చిత్రానికి లేని విధంగా పుష్ప 2ని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11500 థియేటర్స్‌లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పాట్నాలో విడుదలైన పుష్ప 2 ట్రైలర్ రికార్డులను తిరగరాస్తోంది. ఇక క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ చిత్రాల్లో ఐటెం సాంగ్స్‌కు ప్రత్యేక స్థానముంది. ఆయన ప్రతి చిత్రంలోనూ స్పెషల్ సాంగ్ ఉండి తీరాల్సిందే.
ఆర్య నుంచి పుష్ప ది రైజ్ వరకు సుకుమార్ తీసిన అన్ని చిత్రాల్లోనూ ఐటెం సాంగ్స్ ఉన్నాయి. ఇక పుష్ప పార్ట్ 1లోని ఊ అంటావా మావా సాంగ్ మాస్‌కి పూనకాలు తెచ్చిపెట్టింది. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ పాటలో బన్నీతో కలిసి స్టెప్స్ వేయగా.. ఇంద్రావతి చౌహాన్ ఆలపించారు. పుష్ప పార్ట్ 1 హిట్ కావడంలో ఈ సాంగ్ పాత్ర కూడా కీలకం . దీంతో పుష్ప 2లో స్పెషల్ సాంగ్ ఉంటుందని ఎప్పటి నుంచో ప్రచారం జరిగింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ పేరు ప్రముఖంగా వినిపించగా.. అనూహ్యంగా శ్రీలీల పేరు తెరపైకి రావడంతో ఇండస్ట్రీ వర్గాలు షాకయ్యాయి.
కిస్సిక్ అంటూ సాగే ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ వేడుక ఇటీవల చెన్నైలో జరిగింది. శ్రీలీల - అల్లు అర్జున్ ఇద్దరూ డ్యాన్స్ ఇరగదీసేవాళ్లే కావడంతో అందుకు తగినట్టుగానే మూవ్‌మెంట్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. తాజాగా అల్లు అర్జున్ డ్యాన్స్‌పై శ్రీలీల సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబిన్ హుడ్ చిత్ర యూనిట్ నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న శ్రీలీలను డ్యాన్స్‌లో కింగ్ ఎవరని విలేకర్లు ప్రశ్నిస్తారు. దీంతో పక్కనే నితిన్ ఉండటంతో ఆన్సర్ ఇవ్వడానికి ఆమె తటపటాయిస్తుంటారు. అయితే నితిన్ కాస్త ధైర్యం చెప్పడంతో తాను ఇప్పటి వరకు నటించిన వాళ్లలో డ్యాన్సింగ్ కింగ్ అంటే అల్లు అర్జున్ అని మొహమాటం లేకుండా చెప్పేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











