నటి శ్రీరెడ్డి అరెస్ట్.. చంద్రబాబు పుట్టిన రోజునే ఏపీ పోలీసుల అదుపులో!

టెలివిజన్ యాంకర్, యూట్యూబర్, తెలుగు హీరోయిన్ శ్రీరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తున్నది. గత ప్రభుత్వం హాయాంలో అంటే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు పాలనతో చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌, ఇతర ప్రతిపక్ష నేతలపై ఆమె బూతులతో స్వైర విహారం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యలపై ఇటీవల ఏపీలోని పలు ప్రాంతాల్లో ఆమెపై కేసులు నమోదు అయ్యాయి. అయితే ఆ కేసుల వ్యవహారంలో ఆమెను ఆంధ్రా పోలీసులు అదుపులోకి తీసుకొన్నారనే వార్త మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ఈ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

వైఎస్ జగన్ ప్రభుత్వ హాయంలో శ్రీరెడ్డితో సహా పలువురు సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు దారుణంగా కామెంట్లు చేశారు. కుటుంబ సభ్యులను రేప్ చేస్తామని, అలాగే చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తూ వీడియోలు చేశారు. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వారిపై పలు ప్రాంతాల్లో కేసులు నమోదు అయ్యాయి.

Actress Sri Reddy arreste

అయితే సోషల్ మీడియాలో తమపై బండబూతులతో విరుచుకుపడిన వారిపై కేసులు నమోదు చేస్తున్న సమయంలో శ్రీరెడ్డి ఓ వీడియోను రిలీజ్ చేసింది. గత ప్రభుత్వ హాయంలో తాము తప్పు చేశాం. చంద్రబాబు, పవన్, లోకేష్, అనితపై మేము దారుణమైన కామెంట్స్ చేశాం. అందుకు క్షమించండి. మేము ఇక ముందు ఎవరినీ కామెంట్ చేయం. ఆ వ్యవహారాన్ని పెద్ద మనసుతో వ్యవహరించి అరెస్టులు ఆపాలని ఆమె సూచించారు.

గత కొద్ది నెలలుగా ఏపీలో వైసీపీ సానుభూతిపరులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను ఏపీ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీరెడ్డి గుట్టు చప్పుడు కాకుండా సీక్రెట్ తలదాచుకొన్నది. ఆమె లడఖ్ ప్రాంతంలో ఉన్నారు అనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వచ్చాయి. గత కొద్దికాలంగా శ్రీరెడ్డి మౌనం వహించి.. సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వచ్చారు.

అయితే తాజాగా ఏపీలో నమోదైన కేసుల వ్యవహారంలో శ్రీరెడ్డిని అనకాపల్లి పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తున్నది. ఆమెను అనకాపల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారని తెలిసింది. అయితే ఆమెను అరెస్ట్ చేసినట్టు అధికారికంగా ఎక్కడా వెల్లడించకపోవడంతో శ్రీరెడ్డిని అరెస్ట్ చేశారా? లేదా అనే విషయంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉండగా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన రోజే శ్రీరెడ్డి అరెస్ట్ వార్త వెలుగులోకి వచ్చింది. శ్రీరెడ్డిని అరెస్ట్ చేశారనే విషయంపై టీడీపీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత ఐదేళ్లలో ఆమె తన వీడియోలతో చేసిన అరాచకంపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: sri reddy andhra pradesh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X