కారితే నాకు చిరాకు .. బాత్రూమ్‌లో అన్నీ విప్పి చూపించేసిన హాట్ బాంబ్
కొన్నాళ్ల క్రితం భారతీయ చిత్ర పరిశ్రమలో హల్ చల్ చేసిన మీ టూ ఉద్యమం, హీరోయిన్ల క్యాస్టింగ్ కౌచ్ అంశాలు వెలుగులోకి వచ్చిన కొత్తలో శ్రీరెడ్డి కలకలం రేపింది. కొందరు సినీ ప్రముఖులు తనకు అవకాశాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి లోబరచుకున్నారంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. స్టేట్‌మెంట్స్, ప్రెస్‌మీట్‌లతో ఆగకుండా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం వద్ద అర్ధనగ్నంగా నిరసనకు దిగి రాద్ధాంతం చేసింది. ఈ పరిణామాలతో శ్రీరెడ్డి రాత్రికి రాత్రి సెన్సేషనల్ స్టార్ అయ్యింది.
శ్రీరెడ్డి నెక్ట్స్ టార్గెట్ ఎవరు, తెల్లారితే ఏ ప్రముఖుడి బండారం బయటపెడుతుందోనని జనం, మీడియా ఉత్కంఠగా ఎదురుచూశారు. అప్పట్లో ఆమె ఇంటర్వ్యూల కోసం మీడియా ప్రతినిధులు సైతం క్యూ కట్టేవారు. శ్రీరెడ్డిని స్టూడియోలో కూర్చోబెట్టి గంటల తరబడి డిస్కషన్స్ నడిపించాయి కొన్ని న్యూస్ ఛానెళ్లు. తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకే హీరోయిన్లు, ఇతర క్యారెక్టర్లు ఇవ్వాలని చెప్పి మధ్యలో ఆడవారి హక్కులు అంటూ పోరాడింది కూడా. ఈ క్రమంలో సినీ ప్రముఖులనే కాదు.. రాజకీయ నాయకులను కూడా శ్రీరెడ్డి వదల్లేదు. అప్పట్లో శ్రీరెడ్డి ఏ ట్వీట్ చేసినా క్షణాల్లో వైరల్ అయ్యేది.

కానీ రోజులు గడిచేకొద్దీ శ్రీరెడ్డి ఇష్యూ డైవర్ట్ అయ్యి జనం ఆమెను మరిచిపోయారు. కానీ ఆమె మాత్రం సోషల్ మీడియాలో పలు వీడియోలు , పోస్టులు పెడుతూనే ఉంది. చివరికి తన పేరు మీద ఒక యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి అందులో పల్లెటూరి స్టైల్లో కట్టుబొట్టు మార్చి వంటల వీడియోలు పెట్టేది. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు వీరాభిమాని అయిన శ్రీరెడ్డి ఆయనకు, వైఎస్సార్ కాంగ్రెస్‌కు మద్ధతుగా మాట్లాడుతూ ఉండేది. జగన్‌ను, వైసీపీని ఎవరైనా పల్లెత్తు మాట అన్నా వాయించేసేది.
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల ఫలితాలకు ముందు వైఎస్సార్‌సీపీని టార్గెట్ చేసిన వాళ్లలో ఎవరినీ వదలొద్దు .. జగనన్నా అంటూ శ్రీరెడ్డి పెట్టిన వీడియో వైరల్ అయ్యింది. వైసీపీ మరోసారి గెలిచి , జగన్ అధికారంలోకి వస్తారని శ్రీరెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకుని టీడీపీ కూటమిని ఇష్టమొచ్చినట్లు మాట్లాడింది. తీరా కూటమికి పవర్ దక్కడంతో ఆమె గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లయ్యింది. కూటమి నేతలపై అసభ్యపదజాలం వినియోగించిన వారిని, గతంలో కేడర్‌ను వేధించిన వారిని టీడీపీ ప్రభుత్వం టార్గెట్ చేస్తుండటంతో శ్రీరెడ్డి సైలెంట్ అయ్యింది.
ఇదే సమయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనితలపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆమె మెడకు చుట్టుకుంటున్నాయి. దీంతో తనను క్షమించి వదిలేయాలని లోకేష్‌కు శ్రీరెడ్డి లేఖ రాసింది. ఈ క్రమంలో శ్రీరెడ్డికి సంబంధించిన పాత వీడియోలు ట్రెండింగ్‌లోకి వస్తున్నాయి. గతంలో తన ఇంటి బాత్‌రూమ్‌ని ఆమె హోమ్ టూర్ మాదిరిగా చేసింది. అందులో తానే బాత్‌రూమ్‌ని క్లీన్ చేస్తానని, నీట్‌గా లేకపోతే నాకు చిరాకని చెప్పింది. బాత్‌రూమ్‌ని చాలా మంది లైట్ తీసుకుని నాసిరకం ప్రొడక్ట్స్ వాడతారని దాని వల్ల లోపల వాటర్ లీక్ అవుతుందని శ్రీరెడ్డి చెప్పింది. తనకు వాటర్ లీకేజ్, ఇతర ప్లంబింగ్ ప్రాబ్లమ్స్ వస్తే చిరాకని అందుకే కొంచెం ఖరీదు అయినా బ్రాండెడ్ మెటీరియల్ వాడినట్లు తెలిపింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











