’సినిమా ఛాన్స్ ఆశచూపి.. ఆఫర్ల పేరుతో ఆ హీరో శారీరకంగా వాడుకొన్నాడు’
భారతదేశంలో మీ టూ ఉద్యమం, హీరోయిన్ల క్యాస్టింగ్ కౌచ్ అంశాలు వెలుగులోకి వచ్చిన కొత్తలో శ్రీరెడ్డి కలకలం రేపింది. కొందరు సినీ ప్రముఖులు తనకు అవకాశాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి వాడుకున్నారంటూ ఆమె మీడియా ఎదుటర రచ్చ చేసింది. అక్కడితో ఆగకుండా ఏకంగా అర్ధనగ్నంగా నిరసనకు దిగి రాద్ధాంతం చేసింది. ఈ పరిణామాలతో శ్రీరెడ్డి టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యింది.
దీంతో శ్రీరెడ్డి నెక్ట్స్ టార్గెట్ ఎవరు? తెల్లారితే ఏ ప్రముఖుడి బండారం బయటపెడుతుందోనని కొందరి గుండెళ్లలో రైళ్లు పరిగెడుతున్నాయి. అప్పట్లో ఆమె ఇంటర్వ్యూల కోసం మీడియా ప్రతినిధులు సైతం క్యూ కట్టేవారు. శ్రీరెడ్డితో గంటల తరబడి లైవ్ డిస్కషన్స్ నడిపించాయి కొన్ని న్యూస్ ఛానెళ్లు. ఈ దశలో సినీ ప్రముఖులనే కాదు.. రాజకీయ నాయకులను కూడా శ్రీరెడ్డి వదల్లేదు. అప్పట్లో శ్రీరెడ్డి సోషల్ మీడియా ఖాతాల నుంచి ఏ పోస్ట్ వచ్చినా క్షణాల్లో వైరల్ అయ్యేది.

కానీ రోజులు గడిచేకొద్దీ శ్రీరెడ్డిని జనం ఆమెను మరిచిపోయారు. కానీ ఆమె మాత్రం వీడియోలు , పోస్టులు పెడుతూనే ఉంది. చివరికి తన పేరు మీద ఒక యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి అందులో పల్లెటూరి స్టైల్లో కట్టుబొట్టు మార్చి వంటల వీడియోలు పెట్టేది. ఒకసారి ఒంటి నిండా విభూతి పూసుకుని అఘోరలా కనిపించి షాకిచ్చింది. వైసీపీ అధినేత , ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వీరాభిమాని అయిన శ్రీరెడ్డి ఆయనకు మద్ధతుగా మాట్లాడుతూ ఉండేది.
వైసీపీ ఏపీలో అధికారం ఉన్నంత కాలం అడ్డూ అదుపు లేకుండా మాట్లాడిన శ్రీరెడ్డి.. కూటమి నేతలను కూడా వదల్లేదు. 2024 ఎన్నికల్లో తీరా కూటమికి పవర్ దక్కడం, ఆమెపైనా పలు కేసులు నమోదు కావడంతో శ్రీరెడ్డి సైలెంట్ అయ్యింది. రెండ్రోజుల క్రితం తన పేరుతో సర్క్యూలేట్ అవుతున్న ఫేక్ అకౌంట్స్ గురించి వార్నింగ్ ఇచ్చి మరోసారి వార్తల్లోకెక్కింది శ్రీరెడ్డి.

ఇదిలాఉండగా.. టాలీవుడ్‌లోని ఓ హీరో గురించి కన్నడ నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము తీసిన సినిమాను చిత్రాన్ని , తమను సంప్రదించకుండా తెలుగులో రీమేక్ చేశారని ఆయన మండిపడ్డారు. కన్నడ నిర్మాత ఆరోపణల నేపథ్యంలో సదరు హీరో గురించి గతంలో శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యల తాలూకా వీడియో వైరల్ అవుతోంది. ఆ హీరో మా ఇంటికి రెగ్యులర్‌గా వచ్చేవాడని, అప్పుడప్పుడు ఇద్దరం బయటికి వెళ్లే వాళ్లమని చెప్పింది.
తన ఫ్రెండ్ అయిన ఓ నిర్మాతకు రికమెండ్ చేసి సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని ఆ హీరో తనను శారీరికంగా వాడుకున్నాడని శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. దీనిని నిరూపించడానికి తన వద్ద ఆధారాలు లేవని, కానీ మా లాయర్ సూచన మేరకు కోర్టు ద్వారా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నానని ఆమె తెలిపింది. ప్రస్తుతం శ్రీరెడ్డి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఆ హీరో ఎలా రియాక్ట్ అవుతాడో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











