‘అన్నయ్య అలాంటి టార్చర్.. తమ్ముడు నా కేంటి అంటూ లైంగిక వేధింపులు’

తెలుగులో హీరో, హీరోయిన్ల ఫ్రెండ్ రోల్స్‌, వాంప్ తరహా రోల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీసుధ భీమిరెడ్డి. అందరూ డాక్టర్ కాబోయే యాక్టర్ అయితే.. ఈమె మాత్రం డాక్టర్ అయ్యాక యాక్టర్ అయ్యింది. మంచి హైట్, పర్సనాలిటీతో హీరోయిన్లను మించిన అందంతో సెగలు రేపుతుంటారు శ్రీసుధ. సినిమాల కంటే కూడా వివాదాలతోనే ఆమె ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా శ్రీసుధ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వృత్తిరీత్యా ఫిజియోథెరపిస్ట్ అయిన శ్రీసుధలో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కూడా ఉన్నారు. తీరిక సమయాల్లో అడవుల్లోకి వెళ్లి ప్రకృతి అందాలు, జంతువులను కెమెరాలో బంధిస్తూ ఉంటారు. సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు శ్రీ సుధ. బాడీగార్డ్, దమ్ము, ఎవరు, అవును , అర్జున్ రెడ్డి, సరిలేరు నీకెవ్వరు, రూలర్, వలయం, వేర్ ద వెంకట లక్ష్మీ వంటి సినిమాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇక బోల్డ్ కామెంట్స్ చేయడంలో శ్రీసుధ ఎప్పుడూ ముందుంటారు. ఎవరు ఏమనుకున్నా సరే కుండబద్ధలు కొడతారు.

Actress sri sudha bhimireddy Shocking Comments On cinematographer Shyam K Naidu brother chota k naidu

కొద్దిరోజుల క్రితం విమానంలో ప్రయాణిస్తుండగా తనతో అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయి చెంప చెళ్లుమనిపించి అతని ఆట కట్టించింది. అంతేకాదు తనను ఆ వ్యక్తి ఎంతగా ఇబ్బంది పెడుతున్నాడో తెలియజేస్తూ అప్పట్లో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఫోటో వైరల్ అయ్యింది. ఇకపోతే.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు తమ్ముడు శ్యామ్ కే నాయుడు తనను పెళ్లి చేసుకుంటానంటూ మోసం చేశాడని శ్రీసుధ చేసిన ఆరోపణలు చిత్ర పరిశ్రమలో కలకలం రేపాయి.

ఆరోపణలే కాదు ఏకంగా పోలీస్ స్టేషన్‌కి అక్కడి నుంచి కోర్టుల వరకు వీరి వ్యవహారం వెళ్లింది. ఇప్పటికీ తనకు న్యాయం చేయాలంటూ శ్రీసుధ పోరాటం చేస్తున్నారు. పలువురు సినీ పెద్దలు .. శ్యామ్‌పై తాను పెట్టిన కేసును విత్ డ్రా చేసుకోవాలని ఒత్తి చేశారని శ్రీసుధ ఆరోపించింది. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీసుధ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను శ్యామ్‌తో రాజీ చేసుకోలేదని తేల్చిచెప్పారు.

Actress sri sudha bhimireddy Shocking Comments On cinematographer Shyam K Naidu brother chota k naidu

ఇండస్ట్రీలో తనకు మంచి పేరుందని.. ఉదయాన్నే 6 గంటలకు షూటింగ్‌కు వెళ్లాల్సి ఉండేదని అలాంటి తెల్లవారుజామున 2 , 3 గంటల వరకు శ్యామ్ తన ఇంటిలో గోల చేసేవాడని శ్రీసుధ ఆరోపించారు. రాత్రి ఇంత జరిగినా మరలా పొద్దున్నే ఏం జరగనట్లుగా ప్రవర్తించేవాడని .. దీంతో తాను అతని మాటల్ని రికార్డు చేసేదాన్నని .. ఇప్పుడు ఆ రికార్డులే నా కేసుకు ఉపయోగపడుతున్నాయని ఆమె వెల్లడించారు. శ్యామ్ టార్చర్ తట్టుకోలేక అతని అన్నయ్య ఛోటా కే నాయుడి దృష్టికి తీసుకెళితే నా తమ్ముడితో సెటిల్ చేస్తా.. మరి నాకేంటీ అని అడిగేసరికి ఏం మాట్లాడాలో తెలియలేదన్నారు శ్రీసుధ. 2014 నుంచి ఇప్పటి వరకు దాదాపు పదేళ్లుగా శ్యామ్‌తో గొడవ జరుగుతోందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రీసుధ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: shyam k naidu chota k naidu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X