చాలా బాధగా ఉంది.. అలా చేయడం అన్యాయం.. నటి ఆవేదన

'హ్యాపీ జర్నీ' సినిమా విడుదలకు ముందే చిన్న వివాదంతో వార్తల్లో నిలిచింది. గుత్తా ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న హార్ట్‌వార్మింగ్ ఎమోషనల్ డ్రామా 'హ్యాపీ జర్నీ'. అభిరామ్ నాయుడు దర్శకత్వంలోబాలాజీ గుట్ట, కౌశిక్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, తరుణ్ రెడ్డి సహ నిర్మాత ఉన్నారు. ఏడుగురు మహిళల భావోద్వేగ ప్రయాణాలను ప్రధానంగా చూపించే ప్రయత్నం ఈ సినిమా. ఇందులో అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినిషా అలీశెట్టి, రూపా శ్రీనివాస్, సునయన ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, పృధ్వీ దండమూడి, వంశీధర్ గౌడ్, రవి శివతేజ పైలా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఎంతో ప్లెజెంట్‌గా, ఫీల్‌గుడ్ ట్రావెల్ వైబ్‌ను అందిస్తోంది. పారిస్‌లోని ప్రసిద్ధ లూవ్రే పిరమిడ్, ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్, సాఫ్ట్ సన్‌సెట్ బ్యాక్‌డ్రాప్ మధ్య భిన్న తరాల మహిళలు, కొంతమంది యువకులు కలిసి కనిపిస్తున్న తీరు, స్నేహం, ఆప్యాయత, జీవితాన్ని ఆస్వాదించే జర్నీ ని అందంగా ప్రతిబింబిస్తోంది. సమ్ ట్రిప్స్ ఛేంజ్ ఫ్లాన్స్ .. సమ్ ఛేంజ్ లీవ్స్ అనే ట్యాగ్‌లైన్ లైఫ్ ఎమోషన్స్ చుట్టూ తిరుగుతుందని సూచిస్తోంది. అయితే..అయితే ఆ పోస్టర్‌లో తన ఫోటో లేకపోవడంతో సునయన అసంతృప్తి వ్యక్తం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Actress Sunaina Badam Upset Over Missing From Happy Journey Poster Sparks Debate

ఈ నేపథ్యంలో నటి సునయన సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసింది. పోస్టర్‌లో కనిపించకపోవడం తనకు షాక్ ఇచ్చిందని తెలిపింది. ఒక సినిమా ప్రమోషన్‌లో పోస్టర్లు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసని, అలాంటిది తాను నటించిన సినిమాలో కనిపించకపోవడం బాధ కలిగించిందని పేర్కొంది. షూటింగ్ సమయంలో చిన్న గ్యాప్ దొరికితే షాపింగ్‌కు వెళ్లడం సహజమేనని, ఆ కారణంతోనే పోస్టర్‌లో లేకపోవడం అన్యాయం అనిపించిందని చెప్పింది. ఇంట్లోవాళ్లు కూడా "పోస్టర్‌లో నువ్వెక్కడ?" అని అడగడం తనను మరింత బాధపెట్టిందని వెల్లడించింది.

ఇదిలా ఉండగా, దర్శకుడు అభిరామ్ నాయుడు ఈ వివాదంపై స్పందిస్తూ తన వెర్షన్ వివరించారు. పారిస్‌లో క్లిష్ట పరిస్థితుల్లో షూటింగ్ నిర్వహించామని, అందుబాటులో ఉన్న సమయంలోనే పోస్టర్ కోసం ఫోటోలు తీసుకున్నామని చెప్పారు. ఆ సమయంలో సునయన లొకేషన్‌లో లేకపోవడం వల్ల ఆమె ఫోటోలు క్యాప్చర్ చేయలేకపోయామని తెలిపారు. తర్వాత వీఎఫ్ఎక్స్ ద్వారా జోడించే ప్రయత్నం చేసినా సహజంగా కనిపించకపోవడంతో వదిలేశామని స్పష్టం చేశారు.

అయితే దర్శకుడి వ్యాఖ్యలపై సునయన మళ్లీ స్పందిస్తూ, తాను ఎవరినీ నిందించడానికి ఈ విషయాన్ని బయటపెట్టలేదని చెప్పింది. తాను షూటింగ్‌కు ఎప్పుడూ డెడికేషన్‌తో పని చేశానని, ఒక్క రోజు కూడా మిస్ కాలేదని వివరించింది. కో-డైరెక్టర్ ఇచ్చిన అనుమతితోనే కొద్దిసేపు బయటకు వెళ్లానని, అది కూడా మిస్ కమ్యూనికేషన్ కారణంగా జరిగిన అంశమని తెలిపింది. ఒక నటిగా తనకు బాధ కలిగిందని మాత్రమే షేర్ చేశానని క్లారిటీ ఇచ్చింది.

ఈ మొత్తం వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు సునయనకు మద్దతు తెలుపుతుంటే, మరికొందరు మాత్రం ఇది సినిమా ప్రమోషన్ కోసం చేస్తున్న పబ్లిసిటీ స్టంట్ కావచ్చని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి 'హ్యాపీ జర్నీ' సినిమా విడుదలకు ముందే ఈ చిన్న వివాదం ఆసక్తిని పెంచింది. సినిమాపై హైప్ క్రియేట్ చేసే ఉంది. మరి వివాదం నిజమేనా? లేదా పబ్లిక్ స్టంటా? అనేది తెలియాలంటే.. మూవీ మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సిందే..

Read more about: sunaina badam tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X