సురేఖా వాణి వీడియో వైరల్.. కూతురితో కలిసి హల్చల్.. పంచెకట్టులో షాకిచ్చిన నటి
టాలీవుడ్‌లో సైడ్ ఆర్టిస్ట్‌లు ఎంతో మంది ఉన్నారు. ఎమోషన్స్, కామెడీ, విలనిజం ఇలా ప్రతీ క్యారెక్టర్‌ను పోషించే నటీమణులెంతో మంది ఉన్నారు. అయితే కామెడీలో మాత్రం తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుని తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసింది సురేఖా వాణి. ముఖ్యంగా శ్రీనువైట్ల చిత్రాల్లో ఎక్కువగా సందడి చేసే సురేఖా.. సోషల్ మీడియాలోనూ హల్చల్ చేస్తూ ఉంటుంది. కూతురిని కూడా తెరపైకి తీసుకొచ్చేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్న సురేఖా.. అందుకు సోషల్ మీడియాను సాధనంగా వాడుకుంటోంది. తాజాగా ఈ తల్లీకూతుళ్లు చేసిన ఓ వీడియో తెగ హల్చల్ చేస్తోంది.
Recommended Video

అనారోగ్యంతో భర్త..
గతేడాది సురేఖ భర్త సురేష్ తేజ అనారోగ్యంతో మరణించాడు. ఆ మధ్య వారి పెళ్లి రోజు సందర్బంగా.. సురేఖ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. మన జర్నీ ప్రారంభమై ఇరవై యేళ్లు అవుతుందని కానీ ఈరోజు మాత్రం తనతో లేవని.. జీవితాంతం గుర్తుండిపోయే బాధను ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటూ ఎమోషనల్ అయింది.

కూతుర్ని తెరపైకి..
సురేఖా వాణి తన కూతురు సుప్రితతో కలిసి టిక్ టాక్ వీడియోలు చేస్తూ, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లు చేస్తూ నానా రచ్చ చేస్తోంది. ఆ మధ్య కాలా చష్మా అంటూ చేసిన వీడియో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. పొట్టి దుస్తులను ధరించిన సురేఖా వాణి వీడియో ఓ రేంజ్‌లో రచ్చ చేసింది.

విదేశాల్లో ఎంజాయ్..
తల్లీకూతుళ్లిద్దరూ విదేశాల్లో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తుంటారు. ఆ మధ్య సురేఖా వాణి ఫోటో తెగ వైరల్ అయింది. బాత్ టబ్‌లో స్నానం చేస్తూ.. నురగతో ఎంజాయ్ చేస్తూ.. పక్కనే షాంపైన్ బాటిల్ పెట్టుకుని ఫుల్ ఎంజాయ్ చేసింది. సురేఖా వాణి షేర్ పిక్స్, వీడియోలపై ఎక్కువ మొత్తంలో అభ్యంతరాలు వ్యక్తమవుతుంటాయి.

పంచెకట్టులో తల్లీకూతుళ్లు..
తాజాగా తల్లీకూతుళ్లు ఇద్దరూ ఓ టిక్ టాక్ వీడియోను చేశారు. జేండా పూల్ అనే ఓ హిందీ పాటకు పంచెకట్టులో స్టైలీష్‌గా రెడీ అయ్యారు. ఇలా తల్లీకూతుళ్లను పంచెకట్టులో చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు. మొత్తానికి ఈ ఏజ్‌లోనూ సురేఖా వాణి అదరగొడుతోందని కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











