కుర్ర హీరోతో సురేఖ వాణి కూతురు.. క్లారిటీ ఇచ్చినా తగ్గడం లేదు!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వర్గం ఆర్టిస్ట్ లు ఇప్పుడు జనాలను సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా ఆకర్షిస్తున్నాడు. ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ జీవితాల గురించి పెద్దగా తెలిసేది కాదు. నటీనటులు కూడా ప్రయివేట్ లైఫ్ ని ఎక్కువగా ఇష్టపడేవారు. కానీ సోషల్ మీడియా వచ్చిన తరువాత అలాంటి నిర్ణయాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఇటీవల కాలంలో అందరిని ఎట్రాక్ట్ చేస్తున్న వారిలో సురేఖ వాణి ఒకరు. అయితే రీసెంట్ గా వచ్చిన కొన్ని రూమర్స్ కి ఆమె తన సమాధానంతో చెక్ పెట్టింది.

సోషల్ మీడియాలో సరికొత్తగా
సురేఖ వాణి సినిమాల్లో హోమ్లీ పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆమె భర్త మరణించిన తరువాత కొన్నాళ్లు సినిమాలకు దూరమయ్యారు. అనంతరం తన కూతురితోనే లైఫ్ ని హ్యాపీగా గడిపేస్తోంది. అలాగే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వారి సంతోషాల్ని నెటీజన్స్‌తో పంచుకుంటున్నారు.

గ్లామర్ షో..
సినిమాల్లో సురేఖ వాణి చేసే పాత్రలు ఎలా ఉంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చీరలో ఎక్కువగా కనిపించిన సురేఖ వాణి తన పర్సనల్ లైఫ్ లో మాత్రం గ్లామర్ గర్ల్ గా దర్శనమిస్తోంది. కాలేజ్ కి వెళుతున్న కూతురు ఉన్నా కూడా ఆమె ఇంకా యంగ్‌గానే కనిపిస్తోంది. తన గ్లామర్ షోతో నెటీజన్స్‌ని స్పెషల్‌గా ఎట్రాక్ట్ చేస్తోంది.

రూమర్స్..
సురేఖవాణి కూతురు సుప్రీత త్వరలోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు గతంలో కొన్ని వార్తలు వచ్చాయి. ఒక యువ హీరో సినిమాలో ఆమె కథానాయికగా నటించనున్నట్లు వార్తలు రావడంతో అంతా నిజమనే అనుకున్నారు. క్లారిటీ ఇచ్చినప్పటికీ రూమర్స్ తగ్గడం లేదు. రీసెంట్‌గా సురేఖ వాణి తన కూతురి లైఫ్ గురించి ఒక వివరణ ఇచ్చింది. దీంతో సుప్రీత టాలీవుడ్ ఎంట్రీపై ఒక క్లారిటీ వచ్చేసింది.

కూతురి గురించి..
కూతురి గురించి సురేఖ వాణి ఈ విదంగా వివరణ ఇచ్చింది. 'మా అమ్మ నన్ను స్వయంగా నిర్ణయాలు తీసుకోగల స్వతంత్ర మహిళగా పెంచింది. నేను కూడా నా కూతురిని అదే తరహాలో పెంచాను. సుప్రీత టాలీవుడ్‌లోకి అడుగుపెడుతుందా అనే ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను. అది పూర్తిగా ఆమె సొంత నిర్ణయం. ఒకవేళ తను యాక్టింగ్ లో కొనసాగాలని అనుకుంటే నేను ఎంత మాత్రం వద్దని చెప్పను' అని సురేఖ వాణి తెలిపారు.


Click it and Unblock the Notifications











