వైరల్ పిక్ : బాత్ టబ్, పక్కనే షాంపైన్.. సురేఖావాణి యవ్వారం మామూలుగా లేదే..!!
టాలీవుడ్ ఆర్టిస్ట్‌లో ప్రముఖంగా వినిపించే పేరు సురేఖా వాణి. కామెడీ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే సురేఖా వాణి ఈ మధ్య సినిమాల్లో అంతగా కనిపించడం లేదు. చూస్తుంటే ఒకప్పటి హవా తగ్గినట్టు కనిపిస్తోంది. అయితే సినిమాల్లో తన హవా తగ్గిందని అనుకుందో ఏమో గానీ సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతోంది. తన కూతురు సుప్రితతో కలిసి చేసే హంగామా మామూలుగా ఉండదు.

అనారోగ్యంతో భర్త..
కొన్ని నెలల క్రితం సురేఖ భర్త సురేష్ తేజ అనారోగ్యంతో మరణించాడు. రీసెంట్‌గా వీరి పెళ్లి రోజు సందర్బంగా.. సురేఖ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. మన జర్నీ ప్రారంభమై ఇరవై యేళ్లు అవుతుందని కానీ ఈరోజు మాత్రం తనతో లేవని.. జీవితాంతం గుర్తుండిపోయే బాధను ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటూ ఎమోషనల్ అయింది.
కూతురితో కలిసి రచ్చ..
సురేఖా వాణి తన కూతురు సుప్రితతో కలిసి టిక్ టాక్ వీడియోలంటూ నానా రచ్చ చేస్తుంది. ఆ మధ్య కాలా చష్మా అంటూ చేసిన వీడియో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. పొట్టి దుస్తులను ధరించిన సురేఖా వాణి వీడియో ఓ రేంజ్‌లో రచ్చ చేసింది.

సినీ ఇండస్ట్రీలోకి కూతురిని..
సినీ ఇండస్ట్రీలోకి తన కూతురిని తీసుకురావాలని సురేఖా వాణి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇలా సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుందని టాక్ వినిపిస్తుంది. మరి ఆమె ప్రయత్నాలు ఎంత వరకు సఫలీకృతం అవుతాయో చూడాలి.
Recommended Video

విదేశాల్లో ఎంజాయ్..
ప్రస్తుతం తల్లీకూతుళ్లిద్దరూ విదేశాల్లో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నాలుగైదు రోజుల క్రితం సురేఖా వాణి పోస్ట్ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. బాత్ టబ్‌లో స్నానం చేస్తూ.. ఆ నురగతో ఎంజాయ్ చేస్తూ.. పక్కనే షాంపైన్ బాటిల్ పెట్టుకుని ఉన్న ఆ పిక్ చూసి నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు.


Click it and Unblock the Notifications











