అమ్మ పక్కనుండగానే రెచ్చిపోయిన సురేఖా వాణి కూతురు.. హగ్గులు, ముద్దులతో రచ్చ
క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖ వాణి భర్త మరణం తరువాత ఒక రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వాస్తవానికి అంతకు ముందు ఆమె సోషల్ మీడియాలో లేదు. తన సినిమాలు తాను చేసుకుని సైలెంట్ గా ఇంట్లోనే ఉండేది. భర్త చనిపోయిన తర్వాత కూతురు సోషల్ మీడియా అలవాటు చేయడంతో ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయింది.
సురేఖ వాణి షేర్ చేస్తున్న హాట్ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడంతో నెటిజన్లు ఆమె మీద ఆదరణ ఎక్కువ కనబరుస్తున్నారు. సినిమాలు అవకాశాలు రావడం లేదో లేక ఆమె కావాలని తగ్గించుకుందో తెలియడం లేదు. కానీ సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం తన కూతురుతో పోటాపోటీగా అందాలు ఆరబోస్తూ రెచ్చిపోతుంది.

తాజాగా సుప్రీత 22వ పుట్టినరోజు సందర్భంగా ఒక పెద్ద పార్టీ ఇచ్చింది. సురేఖ వాణి ఈ పార్టీలో ఒక రేంజ్ లో రెచ్చిపోయి మరోసారి అందాల ఆరబోతకు దిగారు తల్లీ కూతుళ్లు. సోమవారం నాడు సురేఖ వాణి కుమార్తె సుప్రీత పుట్టినరోజు కావడంతో పబ్బులో దాన్ని సెలబ్రేట్ చేసుకుంది. స్నేహితులు, సన్నిహితులు మధ్య ఆమె కేక్ కట్ చేసి మామూలు రచ్చ కాదు.. ఒక రేంజ్ లో రచ్చ చేస్తూ ఎంజాయ్ చేసింది.
స్నేహితుడు తెచ్చిన కేకులు కట్ చేస్తూ వారితో పాటు డ్రింకులు తాగుతూ రచ్చ చేయడమే కాదు. డాన్సులతో కూడా అలరించే ప్రయత్నం చేసింది. అంతేకాదు ఎక్కడ తగ్గకుండా తన స్నేహితులకు హగ్గులు, కిస్సులు ఇస్తూ రెచ్చిపోయింది. ఇక ఆమె తన పుట్టినరోజు సెలబ్రేషన్ కి సంబంధించిన ఫోటోలను వీడియోలను ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసుకోవడంతో అభిమానులందరూ అవి చూసి అవాక్కవుతున్నారు.

ఇక ఈ వేడుకల్లో పింక్ కలర్ డ్రెస్ ధరించిన సుప్రీత జబ్బ కిందకి ఉండేలా ఒక స్లీవ్ లెస్ గౌన్ వేసుకుని అలరించింది. కేవలం బర్త్డే పార్టీ మాత్రమే కాదు తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా సురేఖవాణి ఒక సర్ప్రైజ్ ఇచ్చింది. అదేమిటంటే ప్రస్తుతానికి వీరు అమెరికాలో పర్యటిస్తున్న నేపథ్యంలో న్యూ జెర్సీలోని వీధుల్లో ఒక బిల్డింగ్ పై సుప్రీతకు ఎంతో ఇష్టమైన తన తండ్రితో కలిసి ఉన్న ఫోటోని ప్రదర్శించి సురేఖ వాణి హ్యాపీ బర్త్డే విషెస్ తెలిపింది.
ఈ మధ్యకాలంలో వీరిద్దరూ కలిసి బిగ్ బాస్ సెవెన్ కి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే బిగ్ బాస్ లోకి వెళ్లే వరకు నిజంగా వారు వెళుతున్నారా లేదా అనే విషయం మీద క్లారిటీ లేదు కానీ టాలీవుడ్ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో కూడా వీరు బిగ్ బాస్ లోకి వెళ్లబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











