Supritha Surekha Vani: ఇంట్లో పద్ధతిగా.. బయట హద్దులు దాటి.. బయటకొచ్చిన సుప్రీత వీడియో!
నటి సురేఖ వాణి కూతురు సుప్రీత సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు నుంచే సోషల్ మీడియా ద్వారా చాలా ఫేమస్ అయిపోయింది. ఆమె సోషల్ మీడియాలో దాదాపు పది లక్షల మంది ఫాలోవర్స్ తో హల్చల్ చేస్తూ ఉంటుంది. తన తల్లితో కలిసి అనేక వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండడంతో ఆమెకు వరుసగా ఫాలోవర్లు పెరిగారు. ఇటీవల అమర్ దీప్ చౌదరితో కలిసి ఓ సినిమా చేసేందుకు కూడా రెడీ అయిపోయింది. ఆ విషయం పక్కన పెడితే.. సుప్రీత వీడియో ఒకటి బయటకు వచ్చి వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే....
తల్లి చాటుకూతురుగా సోషల్ మీడియాకి పరిచయమైన సుప్రీత ఇప్పుడు తల్లి కంటే ఎక్కువ మంది ఫ్యాన్స్ తో హల్చల్ చేస్తోంది. సుప్రీత తనదైన గ్లామర్ షోతో సోషల్ మీడియాలో చేసే హల్చల్ మామూలుగా ఉండదు. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలు వీడియోలు షేర్ చేయడమే కాదు... తన తల్లికి సంబంధించిన విషయాలు కూడా షేర్ చేస్తూ ట్రెండింగ్ లో ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.

ఇక తాజాగా అమర్ దీప్ హీరోగా సుప్రీత హీరోయిన్ గా ఒక సినిమా లాంచ్ అయిన సంగతి కూడా తెలిసిందే. మహర్షి కూండ్ల సమర్పణలో ఎం3 మీడియా బ్యానర్‌పై మహా మూవీస్‌తో కలిసి ప్రొడక్షన్ నెం 2గా మహేంద్ర నాథ్ కూండ్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గురువారం నాడు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి బసిరెడ్డి క్లాప్ కొట్టగా.. ఏఎం రత్నం కెమెరా స్విచ్ ఆన్ చేయగా దర్శకుడు వీర శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు.
ఆ విషయం పక్కన పెడితే.. సుప్రీత వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ.. తన వ్యక్తిగత విషయాలను నెటిజన్స్ కు షేర్ చేస్తుందనే విషయం తెలిసిందే. సురేఖావాణి-సుప్రీత చాలా లగ్జరీ లైఫ్ గడుపుతుంటారు వీరికి పబ్ లు, పార్టీలు వెరీ కామన్. మందు కూడా తాగుతారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.
ఈ విషయాన్ని తానె ఒప్పుకుంటూ సుప్రీత ఓ వీడియో తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఇంట్లో ఉన్నప్పుడు ఒకలా.. ట్రెడిషనల్ గర్ల్ లా... బయటకు వెళితే తన లైఫ్ స్టైల్ మరోలా ఉంటుందని.. చెప్తూ ఓ వీడియో పెట్టింది. ఇంట్లో నిండైన బట్టల్లో పూజలు చేస్తూ హోమ్లీ ట్రెడిషనల్ గర్ల్ లా కనిపిస్తుందట సుప్రీత. బయట మాత్రం హద్దులు దాటేసి... హాట్ డ్రెస్సుల్లో పబ్స్ లో చిందులు వేస్తూ ఎంజాయ్ చేస్తుందని ఆ వీడియోలో చూపించింది.
సుప్రీత తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన లేటెస్ట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. నిజంగానే అలాగే ఉంటారంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక త్వరలో సుప్రీత హీరోయిన్ గా లాంచ్ అవ్వనుంది. మరి ఆ సినిమాతో సుప్రీత ఫేట్ ఏమైనా మారుతుందా అనేది చూడాలి.


Click it and Unblock the Notifications











