మందేసి చిందేసిన సురేఖ వాణి.. ఇదేం గ్లామర్ ట్రీట్ రా బాబూ!

తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కా , తల్లి, వదిన వంటి పాత్రలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఫేమస్ అయ్యారు సురేఖా వాణి. ఒకానొక దశలో అన్ని సినిమాల్లో సురేఖ ఉండాల్సిందే అన్నంతగా ఆమె ముద్ర వేశారు. అయితే ఇప్పుడు సురేఖ హవా తగ్గడంతో పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. ఒకవేళ ఆఫర్లు వచ్చినా ఒకటి అరా తిప్పించి గతంలో మాదిరిగా కాదు. కూతురు సుప్రీతతో కలిసి వెకేషన్‌కు వెళ్లడం, పార్టీలతో సురేఖ ఎంజాయ్ చేస్తుంటారు. అలాగే వాటికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విజయవాడకు చెందిన సురేఖవాణి.. చిన్నప్పటి నుంచి చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేది. 8వ తరగతి చదువుతున్న సమయంలో ఓ ప్రాంతీయ ఛానెల్‌లో వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఇంటర్ వరకు చదువుకున్న ఆమె.. అనంతరం ఫుల్‌టైం హోస్ట్‌గా మారిపోయింది. పెళ్లయిన తర్వాత తన భర్త సురేష్ తేజతో కలిసి స్టార్ మాలో మా టాకీస్, హార్ట్ బీట్, మొగుడ్స్ పెళ్లామ్స్ అనే కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఈ దంపతులకు సుప్రీత సంతానం.

Actress surekha vani enjoys at pub her video on social media goes viral

సురేఖా వాణి - సురేష్‌లది ప్రేమ వివాహం. టీవీ ఇండస్ట్రీలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలని సురేష్ ఎంతో కష్టపడ్డారు. కానీ ఆయనకు నిరాశే ఎదురైంది. అయితే తన భార్య సురేఖను మాత్రం సురేష్ ప్రోత్సహించారు. 2005లో శీనుగాడు చిరంజీవి ఫ్యాన్స్ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టిన సురేఖావాణి ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.

భద్ర, బొమ్మరిల్లు, దుబాయ్ శీను, రెడీ, ఉల్లాసంగా ఉత్సాహంగా, ఓయ్, ఏమాయ చేశావె, బెట్టింగ్ బంగార్రాజు, నమో వెంకటేశ, బావ, ప్రస్థానం, నిప్పు, దేనికైనా రెడీ, నాయక్, బాద్ షా, పవర్, శ్రీమంతుడు, శౌఖ్యం, బెంగాల్ టైగర్, సుప్రీం, శమంతకమణి తదితర చిత్రాల్లో నటించారు. కామెడీ అయినా, సెంటిమెంట్ అయినా అవలీలగా చేయగలదని నిరూపించుకున్నారు సురేఖ. ముఖ్యంగా ఆమె కామెడీ, అమాయకంగా ఫేస్ పెట్టి వేసే పంచ్‌లకు మంచి గుర్తింపు దక్కింది.

అయితే 2019 మే 6 సురేష్ ఆకస్మికంగా కన్నుమూయడంతో సురేఖ వాణి మానసికంగా కృంగిపోయారు. తనను ఎంతగానో ప్రోత్సహించిన భర్త లేకపోవడంతో ఆమె చాలాకాలం పాటు సినిమాలకు దూరమయ్యారు. కొందరు సీనియర్ నటులు మరో పెళ్లి చేసుకుంటూ ఉండటంతో సురేఖ కూడా రెండో పెళ్లి చేసుకుంటారని గాసిప్స్ వైరల్ అయ్యాయి. వాటికి ఆమె తనదైనశైలిలో ఆన్సర్ ఇస్తూ వస్తున్నారు. కుమార్తె సుప్రీతను సంతోషంగా ఉంచేందుకు శ్రమిస్తున్నారు. వీరిద్దరూ కలిశారంటూ ఆ రచ్చ మామూలుగా ఉండదు. సినిమాల్లో పద్ధతిగా కనిపించే సురేఖ వాణి బయట మాత్రం మోడ్రన్ డ్రెస్సులు వేస్తూ షాకిస్తుంటారు.

తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేసిన ఫోటోలు కలకలం రేపుతున్నాయి. ఏకంగా పబ్‌లో చిందులు వేస్తూ మందు గ్లాస్ పట్టుకుని లాగించేస్తున్నారు సురేఖ వాణి. ఇదే పోస్ట్‌లో మోడ్రన్ డ్రెస్సులు వేసుకుని రోడ్డుపై కూర్చొని ఎద అందాలను పరిచేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతుండగా సురేఖ రచ్చ చూసి నెటిజన్లు బాబోయ్ అంటున్నారు.

More from Filmibeat

Read more about: surekha vani movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X