ఆ ప్లేస్‌లో టాటూ .. నొప్పి తట్టుకోలేక సురేఖ వాణి కేకలు
ఇటీవలి కాలంలో టాటూల ట్రెండ్ బాగా ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు మహానగరాలు, పట్టణాలకే పరిమితమైన ఈ కల్చర్ ఇప్పుడు గ్రామాలకు కూడా విస్తరిస్తోంది. సెలబ్రెటీలను చూసి ప్రజలు కూడా టాటూలు వేయించుకునేందుకు ఎగబడుతున్నారు. సెలబ్రెటీలలో కొందరైతే ఒళ్లంతా పచ్చబొట్టు వేయించుకుంటూ దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తుంటారు. కుర్రకారే కాకుండా వయసుతో సంబంధం లేకుండా కొందరు ముదురు భామలు కూడా టాటూలు వేయించుకుంటూ ముచ్చట తీర్చుకుంటున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకే వస్తారు టాలీవుడ్ నటి సురేఖ వాణి. ఈ వివరాల్లోకి వెళితే..
కూతురితో కలిసి వెకేషన్
50కి దగ్గర అవుతున్నప్పటికీ ఇంకా చిన్న పిల్లలాగే సందడి చేస్తుంటారు సురేఖవాణి. తన కూతురితో కలిసి విహారయాత్రలు, హాలిడే ట్రిప్‌లకు వెళ్తుంటారు. ఈ వయసులోనూ టూ పీస్ బికినీలు ఇతర మోడ్రన్ డ్రెస్సుల్లో సందడి చేస్తుంటారు. కూతురికి చెప్పాల్సిన వయసులో మీరు కూడా ఇలా చేస్తున్నారేంటీ అన్ని ఎన్ని విమర్శలు వచ్చినా ఆమె ఏమాత్రం పట్టించుకోదు. తల్లీకూతుళ్లు డ్యాన్స్ చేసే వీడియోలు, ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తుంటారు. వీరి పోస్టుల వల్ల కొన్నిసార్లు సుప్రీత, సురేఖలను నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్ చేస్తుంటారు.

హాట్ టాపిక్‌గా సురేఖ రెండో పెళ్లి
సురేఖ వాణి కూతురు సుప్రీతకు సోషల్ మీడియాలో బీభత్సమైన ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. టిక్‌టాక్ బ్యాన్ చేయడంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె రకరకాల వీడియోలు చేస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంటారు. మొన్నామధ్య తన ఫాలోవర్స్‌తో నిర్వహించిన ఓ సెషన్‌లో తనకు, తన తల్లికి సంబంధించిన అనేక విషయాలను పంచుకుంది సుప్రీత. తాను ప్రేమ పెళ్లి చేసుకుంటానని తేల్చిచెప్పింది. తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ అని తెలిపింది ఈ ముద్దుగుమ్మ. అయితే సోషల్ మీడియాలో సురేఖ వాణి రెండో పెళ్లి గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇటీవల తన గురించి లేనిపోనివి కల్పించి రాయడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నా పేరు చెప్పుకుని బతుకుతున్నారు
మొన్నామధ్య సురేఖా వాణి గుండు చేయించుకున్న ఫోటోలు వైరల్ కాగా.. గుండులో కూడా బాగున్నానని కామెంట్స్ వస్తున్నాయని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. భర్త చనిపోయిన తర్వాత విచ్చలవిడితనం పెరిగిందని, అడ్డు చెప్పేవాళ్లు లేకపోవడంతో ఇలా తిరుగుతోందని అంటున్నారని సురేఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకు చిన్న వయసులోనే పెళ్లి జరిగిందని.. ఒకవేళ తన భర్త జీవించి ఉన్నా ఇలాగే తిరిగేవాళ్లమని నెటిజన్ల నోళ్లు మూయించింది సురేఖా వాణి. తొలుత ట్రోలింగ్, విమర్శలు చూసి చాలా బాధపడ్డానని, కానీ ఇప్పుడు పట్టించుకోవడం మానేశానని వెల్లడించారు. నా పేరు చెప్పుకుని డబ్బులు సంపాదించుకుంటున్నారు.. బతుకుతున్నారని ఘాటుగా కౌంటర్ వేసింది.
అక్కడ టాటూ వేయించుకున్న సురేఖ
తాజాగా సురేఖా వాణి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఏకంగా 48 ఏళ్ల వయసులో పచ్చబొట్టు వేయించుకునే సాహసం చేసింది సురేఖ. తన ఇష్టదైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదుకలను, గోవింద నామాలను కుడిచేతిపై టాటూగా వేయించుకుంది. అయితే పచ్చబొట్టు వేయించుకునే సమయంలో నొప్పితో అల్లాడిపోయిన సురేఖ.. అరుపులు, కేకలు పెట్టింది. దీంతో తల్లిని యాంకరేజ్ చేసేందుకు గోవింద నామాలను పాడుతూ, చప్పట్లు కొట్టింది సురేఖ. టాటూ పూర్తయ్యే వరకు నొప్పిని భరించిన సురేఖ.. చివరిలో పచ్చబొట్టు చూసుకుని మురిసిపోయింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ముందు నా పెదబాబు నడుస్తాడని, ఆయనను నేను అనుసరిస్తా.. గోవిందా గోవిందా అని సురేఖ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు తలో రకంగా కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











