బెడ్‌పై సురేఖా వాణి చిలిపి పనులు.. రొమాంటిక్ ఫోజుల్లో అరాచకం!

చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం సెకండ్ మ్యారేజ్‌ల ట్రెండ్ బాగా నడుస్తోంది. జీవిత భాగస్వాముల నుంచి విడాకులు, విడిపోవడం, మరణం తదితర కారణాలతో విడిగా ఉంటున్న సెలబ్రెటీలు పలువురు రెండో పెళ్లి చేసుకుంటున్నారు. ఈ ప్రస్తావన వచ్చినప్పుడల్లా టాలీవుడ్‌కు చెందిన ఓ నటి పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. ఆమె ఎవరో కాదు సురేఖా వాణి. భర్త మరణంతో ఒంటరిగానే జీవితాన్ని నెట్టుకొస్తూ కూతురిని పెంచి, పెద్ద చేశారు సురేఖ. సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్టులు వైరల్ అవుతుంటాయి. తాజాగా సురేఖ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో దుమారం రేపుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

8వ తరగతిలోనే యాంకరింగ్

విజయవాడలో పుట్టి పెరిగిన సురేఖవాణి 8వ తరగతి చదువుతున్నప్పుడు అంత చిన్న వయసులోనే అక్కడి ఓ లోకల్ ఛానెల్‌లో యాంకర్‌గా చేసింది. ఇంటర్ వరకు నెట్టుకొచ్చిన ఆమె.. అనంతరం యాంకరింగ్‌లోనే స్థిరపడాలని నిర్ణయించుకుంది. చిన్న వయసులోనే మీడియా రంగానికే చెందిన సురేష్ తేజతో సురేఖ వివాహం జరిగింది. సురేఖా వాణి - సురేష్‌లది ప్రేమ వివాహం. వృత్తిరీత్యా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి వీరిద్దరూ పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. ఈ దంపతులకు సుప్రీత సంతానం.

Actress surekha vani video goes viral in social media

సురేఖను ప్రోత్సహించిన భర్త

సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని సురేష్ ఎంతో కష్టపడ్డారు. కానీ ఆయనకు నిరాశే ఎదురైంది. అయితే సురేఖ ప్రతిభను గుర్తించిన సురేష్ తన భార్యకు మాత్రం అన్ని రకాలుగా అండగా నిలిచారు. ఈ క్రమంలో భర్తతో కలిసి స్టార్ మాలో మా టాకీస్, హార్ట్ బీట్, మొగుడ్స్ పెళ్లామ్స్ అనే కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 2005లో శీనుగాడు చిరంజీవి ఫ్యాన్స్ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టిన సురేఖావాణి ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. అనతికాలంలోనే అక్కా, అమ్మ, వదిన వంటి రోల్స్‌కు కేరాఫ్‌గా మారారు. సెంటిమెంట్, కామెడీ, సీరియస్ ఇలా ఏదైనా అద్భుతంగా చేయగలనని నిరూపించుకున్నారు.

సురేఖ రెండో పెళ్లిపై గాసిప్స్

పర్సనల్‌గా, కెరీర్ పరంగా సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్న దశలో సురేఖా వాణి జీవితంలో విషాదం చోటు చేసుకుంది. 2019 మే 6 ఆమె భర్త సురేష్ హఠాన్మరణం చెందడంతో సురేఖ వాణి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి సినిమాలకు సైతం దూరమయ్యారు. ఈ దశలో ఆమె గురించి మీడియాలో ఎన్నో రూమర్స్ వైరల్ అయ్యాయి. సురేఖ రెండో పెళ్లి చేసుకోబోతున్నారని పలుమార్లు వార్తలు చ్చాయి. అయితే వాటిని ఆమె ఖండిస్తూ వచ్చారు. భర్త లేకపోయినా కుమార్తె సుప్రీతను ఒంటరి తల్లిగా పెంచి పెద్ద చేశారు. వీరిద్దరూ తల్లికూతుళ్లలా కాకుండా ఫ్రెండ్స్‌లా ఉంటారు. మొన్నామధ్య మందు గ్లాస్ పట్టుకుని చిందులు వేస్తున్న వీడియో వైరల్ అయ్యింది. వీరిద్దరి తీరుపై పలుమార్లు విమర్శలు వచ్చినా సురేఖ డోంట్ కేర్ అంటారు.

48 ఏళ్ల వయసులో బెడ్‌పై అరాచకం

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సురేఖా వాణి ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలు, ఇతర సంగతులను పంచుకుంటూ ఉంటారు. ఇంట్లో ఏం జరిగినా సరే దానిని తక్షణం ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేస్తుంటారు. తాజాగా బెడ్‌‌పై పడుకుని చిలిపి చేష్టలతో కేక పెట్టించారు సురేఖ. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్తా వైరల్ అవుతోంది. మరి ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా సురేఖ అల్లరిని చూసేయండి.

More from Filmibeat

Read more about: surekha vani supritha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X