twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టార్చర్‌గా ఉందా? అవమానంగా భావిస్తున్నారా? త్రిష ఆవేదన

    |

    అందాల నటి త్రిష కోవిడ్ 19 కారణంగా స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. యూనిసెఫ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఆమె తన వంతు బాధ్యతగా ఓ వీడియోను రిలీజ్ చేసింది. కరోనావైరస్ వేగంగా విస్తరిస్తున్నందును ఆ ముప్పును తగ్గించాలని విదేశాల నుంచి ఇండియాకు వచ్చిన వారికి సూచింంచారు.

    స్వదేశంలో లాక్‌డౌన్ అమలవుతున్ననందున ముందు జాగ్రత్త చర్యగా విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారు స్వీయ గృహనిర్బంధంలోకి వెళ్లి సోషల్ డిస్టెన్స్‌ను పాటించాలి అని సూచించారు. కోవిడ్ 19 వేగంగా విస్తరిస్తున్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని అన్నారు.

    Actress Trisha Krishnan releases video on Coronavirus lockdown

    ఇది మీకు టార్చర్‌గా అనిపించవచ్చు. ఇంట్లోనే గడపడం అవమానంగా అనిపించవచ్చు. కానీ మీ క్షేమం కోసమే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకొన్నదనే విషయాన్ని గమనించాలి. దయచేసి ప్రభుత్వ ఆదేశాలను బ్రేక్ చేయకండి. ఇంట్లోనే ఉంటూ క్షేమంగా ఉండండి. మనమంత ఒకే మాటకు కట్టుబడి ఐక్యంగా ఉంటేనే కరోనాను తరిమి కొట్టవచ్చు అని త్రిష వీడియోలో వెల్లడించింది.

    ఇటీవలే టిక్‌టాక్ యాప్‌లొకి ప్రవేశించిన త్రిషకు చేతినిండా ప్రాజెక్టులు ఉన్నాయి. శరవణన్ రూపొందించే రాంగీ, సుమంత్ రాధాకృష్ణన్ తెరకెక్కించే షుగర్, మణిరత్నం రూపొందిస్తున్న పొన్నియన్ సెల్వన్ చిత్రాల్లో నటిస్తున్నారు.

    English summary
    South Actress Trisha Krishnan releases video on Coronavirus lockdown. She released a video that, Coronavirus or Covid-19 is a fast-spreading disease. People, who have returned from foreign countries, please self-quarantine yourselves.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X