టాలీవుడ్‌లోకి వాణి విశ్వనాథ్ కూతురు.. చిరంజీవి ‘ఘరానా మొగుడు’ టైటిల్‌తో!
టాలీవుడ్‌లో రికార్డులు తిరగరాసిన ఘరానా మొగుడు టైటిల్‌తో మరో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది. మెగాస్టార్ చిరంజీవికి కెరీర్‌లో అతి పెద్ద విజయాన్ని అందించిన చిత్రానికి సంబంధించిన టైటిల్ మరోసారి వెండితెర మీద ఆవిష్కృతం కానున్నది. అయితే అందులో నటించిన వాణి విశ్వనాథ్ కూతురు వర్ష విశ్వనాథ్ హీరోయిన్‌గా నటిస్తూ తెలుగు తెరకు పరిచయం కావడం విశేషంగా మారింది.

యస్‌యమ్‌కే ఫిలిమ్స్, వీఎన్ఆర్ ఫిలిమ్స్ బ్యానర్‌పై మోహన్ కృష్ణ, వర్ష విశ్వనాథ్ హీరో, హీరోయిన్లుగా రాజుబాబు దర్శకత్వంలో ఘరానా మొగుడు చిత్రం రూపొందుతున్నది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ మణికొండలోని శివాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన తుమ్మలపల్లి రామసత్యనారాయణ హీరో, హీరోయిన్లపై క్లాప్ కొట్టగా, జెమిని సురేష్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఏ.ఎస్ రవికుమార్ స్క్రిప్ట్ అందజేశారు.
తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ ..చిత్ర నిర్మాత, హీరో, మోహన్ కృష్ణ చిరంజీవికి వీరాభిమాని. చిరంజీవి నటించిన ఘరానా మొగుడు సినిమా టైటిల్‌తో ఆయన సినిమా తీస్తున్నాడు. చిరంజీవి నటించిన ఘరానా మొగుడు ఎంత ఘనవిజయం సాధించినట్టే ఈ ఘరానా మొగుడు చిత్రం కూడా అంతటి పెద్ద విజయం సాధించాలని ఆకాక్షించారు.

దర్శకుడు సాగర్, ఏయస్ రవికుమార్ మాట్లాడుతూ... చిరంజీవి నటించిన ఘరానా మొగుడు చిత్రంలో వాణి విశ్వనాథ్ నటించింది. ప్రస్తుతం ఘరానా మొగుడు చిత్రంలో వాణి విశ్వనాథ్ కూతురు వర్ష విశ్వనాథ్ నటిస్తుండటం విశేషం. హీరో, నిర్మాత మోహన్, వర్ష విశ్వనాథ్ మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను అని అన్నారు. అన్నారు.
హీరోయిన్ వర్ష విశ్వనాథ్ మాట్లాడుతూ .. ఘరానా మొగుడు నాకు రెండో సినిమా. నా తొలి చిత్రం రెడ్డిగారి ఇంట్లో రౌడీయిజం విడుదలకు సిద్ధంగా ఉంది. రెండో మూవీ మా అమ్మ నటించిన ఘరానా మొగుడు టైటిల్‌తో రూపొందడం హ్యాపీగా ఉంది అని అన్నారు.
చిత్ర నిర్మాత, హీరో, మోహన్ కృష్ణ మాట్లాడుతూ .. ఇప్పటివరకు బావమరదలు, మోహన్ కృష్ణ గ్యాంగ్ లీడర్ సినిమాలను నిర్మించాను. నా ప్రొడక్షన్‌లో మూడో చిత్రం. చిరంజీవి గారు నటించిన ఘరానా మొగుడు టైటిల్‌తో చిత్రం తీసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో సినిమా తీయడానికి ముందుకు వచ్చాను అని అన్నారు.

చిత్ర దర్శకుడు రాజుబాబు మాట్లాడుతూ ...నాకు చిరంజీవి గారు అంటే ఎనలేని అభిమానం చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఈ 1999లో సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. నేను చూసిన మొదటి సినిమా ఘరానా మొగుడు టైటిల్‌కు దర్శకత్వం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నా పుట్టిన రోజున ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనందుకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు
నటీనటులు, సాంకేతిక నిపుణులు
మోహన్ కృష్ణ, వర్ష విశ్వనాథ్, రావు రమేష్, జీవి సుధాకర్ నాయుడు, భానుచందర్, ప్రసన్న కుమార్, సుధ, దేవి, కలర్స్ వాసు, గీతాసింగ్, జబర్దస్త్ అప్పారావు, పృథ్వి ,బోనం బాబి, సమీర్ శర్మ ,పింగ్ పాంగ్ సూర్య, రమేష్ ,బాలాజీ, కీర్తి ,జయశ్రీ తదితరులు
స్క్రీన్ ప్లే, డైరెక్షన్: రాజుబాబు అచ్చరథ
కథ, మాటలు: శింగలూరి మోహన్‌రావు
నిర్మాత: మోహన్ కృష్ణ
సినిమాటోగ్రఫి: మురళి
మ్యూజిక్ :- ఘన్‌శ్యామ్
ఎడిటర్: కేఏవై పాపారావు
ఫైట్ మాస్టర్: రామ్ సుంకర
సాహిత్యం: శరత్ చంద్ర
డాన్స్:-రాజ బోయిన, మహేష్
పీఆర్వో: సాయి సతీష్
పబ్లిసిటీ డిజైనర్ :- విజయ్ కుమార్ బండి
బ్యానర్: యస్‌యమ్‌కే ఫిలిమ్స్, వీయన్ఆర్ ఫిలిమ్స్


Click it and Unblock the Notifications











