AP Elections ఓటమిని ఫలితాలకు ముందే ఒప్పుకొన్న రోజా.. టీడీపీ కాదు.. సొంత పార్టీవాళ్లే ముంచేశారంటూ..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు ఎదురుగాలి వీయడంతో మంత్రివర్గంలోని ప్రధాన నేతలు ఓటమి పాలవుతారని సర్వేలు బలంగా చెబుతున్నాయి. 2024 ఎన్నికల్లో ప్రధానంగా ఓటమి అంచున మంత్రులు రోజా, అంబటి రాంబాబు, గుడివాడ అమరనాథ్ లాంటి ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె చేసిన సంచలన వ్యాఖ్య వివరాల్లోకి వెళితే..

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరిలో రెండుసార్లు ఘన విజయం సాధించారు. అయితే ఈసారి ఓటమి ముప్పును రోజా ఎదుర్కొంటున్నారనే వార్తలు సంచలనంగా మారాయి. అయితే ఆమెకు సొంత పార్టీ నేతల నుంచే అసమ్మతి బెడద ఉందనే విషయం చర్చనీయాంశమైంది. అయితే అసమ్మతి అధిగమించే ప్రయత్నం చేస్తూ ప్రచారం నిర్వహించింది.

Actress YSRCP leder Roja alleges own party leaders against for her Defeat in Nagari Constituency

ఇక మే 13వ తేదీన ఆంధ్రాలో జరిగిన ఎన్నికల్లో పోలింగ్ తర్వాత మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె దాదాపు తన ఓటమిని అంగీకరించిన విధంగా మాట్లాడటం రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నది. అయితే రోజాకు వ్యతిరేకంగా జిల్లా నేతలు ఎందుకు అలా వ్యవహరించారనే విషయంపై రకరకాల భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.

Actress YSRCP leder Roja alleges own party leaders against for her Defeat in Nagari Constituency

నగరి నియోజకవర్గంలో ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత రోజా మీడియాతో మాట్లాడుతూ.. ఇక్కడ నాకు తెలుగుదేశం పార్టీ వాళ్లతో ఎలాంటి సమస్య లేదు. కానీ నగరిలో కేజే కుమార్ వాళ్ల గ్రూప్ నుంచి నాకు ప్రాబ్లెం ఉంది. వైఎస్ జగన్ పర్యటనకు వస్తే.. ఎయిర్‌పోర్టులో ఆయన ఆశీర్వాదం తీసుకొంటారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయమని ప్రచారం చేస్తున్నారు అని అన్నారు.

కేజే కుమార్ గ్రూప్‌కు సంబంధించిన వ్యక్తులు నగరిలో గడపగడపకు తిరుగుతూ.. ప్రతీ బూత్‌లో ప్రచారం చేస్తూ తెలుగుదేశం, సైకిల్ గుర్తుకు ఓటు వేయమని చెబుతున్నారు. టీడీపీ నేతలు కూడా ఇలా ప్రచారం చేయడం లేదు. కానీ ఆయన మాత్రం నీచానికి దిగజారారు అని రోజా ఆరోపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X