హాలీవుడ్‌లోకి అదా శర్మ ఎంట్రీ.. మగరాయుడిగా బ్యూటీ

సినీ పరిశ్రమలో నాకు చోటు దక్కడం చాలా గర్వంగా ఉంటుంది. నాకు లభించిన ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నిస్తాను. ఎందుకంటే నాలాగా ఎంతో మంది సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటారు. అందరికీ నాకు దక్కినట్టు ఆఫర్లు లభించవు. అందుకే నేను చాలా హ్యాపీగా ఫీలవుతాను అని అదా శర్మ అన్నారు. తాజాగా రాజశేఖర్‌తో కలిసి కల్కి చిత్రంలో అదాశర్మ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

తెలుగులో ఓ సినిమా చేస్తున్నాను. హిందీలో రెండు సినిమాలు చేస్తున్నాను. హాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తున్నాను. కమెండ్ 3 చిత్రంలో భావన రెడ్డిగా తెలుగు యువతి పాత్రలో నటిస్తున్నాను. హిందీ సినిమాలో తెలుగు యువతిగా కనిపించడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా ఇటీవల లండన్‌లో షూట్ పూర్తయింది.

 Adah Sharma in hollywood movie Man to Man

హాలీవుడ్‌‌లో మ్యాన్ టు మ్యాన్ సినిమాలో మగ రాయుడిలా కనిపించబోతున్నాను. ఓ అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకొంటుంది. ఆ తర్వాత చేసుకొన్నది అమ్మాయిని కాదు.. అబ్బాయిని తెలుసుకొంటుంది. ఆ పాత్ర నాకు ఓ ఛాలెంజ్ లాంటింది. ఆ పాత్ర నాకు మంచి గుర్తింపు తెస్తుంది. మగరాయుడి పాత్ర ఎలా ఉంటుందో నేను చెప్పను. తెర మీద చూస్తే థ్రిల్‌గా ఫీలవుతారు అని అదా శర్మ చెప్పారు.

ఇక హాలీడే అనే వెబ్ సిరిస్‌లో నటిస్తున్నాను. ముగ్గురు అబ్బాయిలతో చేసే జర్నీ నేపథ్యంగా కథ నడుస్తు్ంది. ఇప్పటికే ఓ వెబ్ సిరీస్‌లో నటించాను. నేను కమర్షియల్ సినిమానా? నాన్ కమర్షియల్ సినిమానా? అనేది పట్టించుకోను. మంచి రోల్ అనిపిస్తే వెంటనే ఒప్పేసుకొంటాను. క్షణం సినిమా ఆ క్రమంలోనే చేసింది. ఆ సినిమాకు నాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది అని అదా శర్మ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X