The Kerala Story: ఇక నుంచి తెలుగులో వివాదాస్పద చిత్రం 'ది కేరళ స్టోరీ'.. ఎప్పటి నుంచో తెలుసా?
ఇటీవల ట్రైలర్ నుంచి సినిమా విడుదల వరకు వివాదాలకు గురైన హిందీ సినిమా ది కేరళ స్టోరి. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రధాన పాత్రలో హార్ట్ ఎటాక్ బ్యూటి ఆదా శర్మ నటించిన విషయం తెలిసిందే. ఆమెతోపాటు యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. విపుల్ అమృతలాల్ షా నిర్మించిన ఈ సినిమా ఇప్పటివరకు హిందీలో మాత్రమే వచ్చింది. కానీ తాజాగా ది కేరళ స్టోరీ సినిమాను తెలుగులో కూడా విడుదల చేశారు.
2 రాష్ట్రాల్లో నిషేధం : అత్యంత విమర్శల నడుమ మే 5న విడుదలైంది ది కేరళ స్టోరీ (The Kerala Story). ఈ సినిమాకు తొలి రోజు నుంచి అనూహ్యమైన స్పందన వస్తోంది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద కోట్ల రాబడుతోంది. ఇప్పటికే ఈ సినిమా హిందీ వెర్షన్ రూ. 100 కోట్ల నెట్ ఇండియా కలెక్షన్స్ కు దగ్గరగా ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సినిమాపై నెలకొన్న వివాదంతో తమిళనాడు, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో నిషేధించారు.

పెరుగుతున్న స్పందన : తమిళనాడులోని చెన్నై, కోయంబత్తూర్, మదురై, సేలంతోపాటు పలు ముఖ్య నగరాల్లోని మల్టీప్లెక్స్ లలో షోలు క్యాన్సిల్ చేశారు. ఈ సినిమాను బ్యాన్ చేయాలని గత కొద్దిరోజులుగా నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ది కేరళ స్టోరీ ప్రదర్శించే థియేటర్లను ముట్టడిస్తామని తమిళ పార్టీలు, ముస్లీం సంఘాలు హెచ్చరించాయి. ఇలా నిరసనలు జరిగినప్పటికీ సినిమాపై రోజురోజుకీ స్పందన పెరిగిపోతుంది.

37 దేశాల్లో : అయితే ది కేరళ స్టోరీ సినిమాపై విమర్శలే కాకుండా పలువురు సపోర్ట్ చేసేవారు కూడా ఉన్నారు. తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాల్లో సినిమాను నిషేధించగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తోపాటు పలు రాష్ట్రాల్లో ట్యాక్స్ ఫ్రీ కూడా ఇచ్చారు. ఈ సినిమాకు వస్తున్న ఆదరణతో మరింతగా ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే మే 12న 37 దేశాల్లో ఈ సినిమాను విడుదల చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో : అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ తోపాటు పలు దేశాల్లో ది కేరళ స్టోరీ మూవీని మే 12న రిలీజ్ చేసినట్లుగా సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాను తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రిలీజ్ చేశారు. అది కూడా ఇవాళ్టి నుంచి. అంటే మే 13 నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ది కేరళ స్టోరీ సినిమాను (The Kerala Story In Telugu) తెలుగులో విడుదల చేశారు.

సర్వత్రా విమర్శలు : ఇటీవల కాలంలో ది కాశ్మీర్ ఫైల్స్, కాంతార వంటి తదితర చిత్రాలను మౌత్ టాక్ పరంగా పాన్ ఇండియా సినిమాగా విడుదల చేస్తన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ది కేరళ స్టోరీని కూడా వివిధ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు ఓటీటీ రైట్స్ జీ5కి వెళ్లగా.. కేరళలోని వేల మంది యువతులను పెళ్లి ద్వారా మత మార్పిడికి గురైనట్లుగా తెరకెక్కించారు. తర్వాత దాన్ని ముగ్గురు మహిళలుగా చూపించారు. దీంతో దీనిపై సర్వత్రా విమర్శలు, వివాదాలు నెలకొన్నాయి.


Click it and Unblock the Notifications











