ఆ హీరో సినిమాను బ్లాక్ టికెట్ కొనుక్కొని చూశా.. అడివి శేషు
యాంగ్రీ హీరో కార్తీ కథానాయకుడిగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు, తిరుప్పూర్ వివేక్ నిర్మిస్తున్న డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ 'ఖైదీ'. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రీసత్యసాయి ఆర్ట్స్ కె.కె.రాధామోహన్ సమర్పిస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 25నప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్ దసపల్లా హోటల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో..
హీరో అడివి శేష్ మాట్లాడుతూ - "ఆవారా' సినిమాకు నేను బ్లాక్ టికెట్ కొనుక్కొని చూశాను. ట్రైలర్ నచ్చి ట్వీట్ చేయడం, ఇక్కడికి రావడం జరిగింది. నేను కార్తీ సినిమాలకు పెద్ద ఫ్యాన్ ని. మీ అందరితో పాటు నేను అక్టోబర్ 25న థియేటర్స్ లో సినిమా చూస్తాను" అన్నారు.

శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ - "బెంగాల్ టైగర్', 'పంతం' మూవీస్‌తో నాకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమాతో ఇంకా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ఇదొక కొత్త తరహా సినిమా. ప్రస్తుతం ఆడియన్స్ సినిమాల్లో చేంజ్ కావాలి అనుకుంటున్నారు అలాంటిచేంజ్ఉన్న సినిమా. మేము ముందే చెప్పినట్టు ఈ సినిమాలో రొమాన్స్, సాంగ్స్ లేవు కానీ కానీ రెండు గంటల ఇరవై నిముషాలు మిమ్మల్ని థియేటర్స్ లో కట్టిపడేస్తుంది. ఫాదర్, డాటర్ సెంటిమెంట్ చాలా బాగా ఉంటుంది. అందరూ ఈ సినిమాని సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను" అన్నారు.
టెక్నికల్ టీమ్
సంగీతం: సామ్ సి.ఎస్.,
సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్,
ఎడిటింగ్: ఫిలోమిన్ రాజ్,
మాటలు: రాకేంద్ర మౌళి,
తెలుగు రాష్ట్రాల్లో సమర్పణ : శ్రీసత్యసాయి ఆర్ట్స్ కె.కె.రాధామోహన్,
నిర్మాతలు: ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు, తిరుప్పూర్ వివేక్,
దర్శకత్వం: లోకేష్ కనకరాజ్.


Click it and Unblock the Notifications











