రవిబాబు మూవీ ‘అదుగో’ టీజర్ వచ్చేసింది
విలక్షణమైన పాత్రలు చేస్తూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రవిబాబు... అటు దర్శకుడిగానూ తన విలక్షణతను చాటుకున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన అల్లరి, అమ్మాయిలు అబ్బాయిలు, నచ్చావులే, అవును లాంటి చిత్రాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చాయి. త్వరలో రవిబాబు నుండి మరో విభిన్నమైన సినిమా రాబోతోంది.
'అదుగో' పేరుతో ఓ పందిపిల్ల చుట్టూ తిరిగే కథతో రవిబాబు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైంది. ప్రస్తుతానికి టీజర్లో పంది పిల్లను మాత్రమే చూపించారు. ఈ చిత్రంలో అభిషేక్ వర్మ, నాభ, రవిబాబు, ఉదయ్ భాస్కర్, ఆర్కే, వీరేంద్ర చౌదరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే చిత్రం విడుదల కావాల్సి ఉండగా సినిమాకు కీలకమైన గ్రాఫిక్స్ సరైన సమయానికి పూర్తికాకపోవడంతో రిలీజ్ ఆసల్యం అవుతూ వచ్చింది. 3డి యానిమేషన్ సీన్లు, గ్రాఫిక్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తాయట. ఈ సినిమా కోసం కొంతకాలంగా రవిబాబు ఓ పంది పిల్లను సైతం పెంచుకుంటున్నారంటే ఆయన ఈ సినిమా విషయంలో ఎంత కేర్ తీసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు.

షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం దసరాకు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్లో పంది పిల్లపై సినిమా రావడం ఇదే తొలిసారి. ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











