Adipurush థియేటర్‌లో ఆంజనేయస్వాకి సీటు ఇదిగో.. మాట నిలబెట్టుకొన్న ప్రభాస్ నిర్మాత, దర్శకులు
ప్రపంచవ్యాప్తంగా ఆదిపురుష్ ఫీవర్ ప్రేక్షకులను వెంటాడుతున్నది. వాల్మికీ రామాయణం చిత్రం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతిసనన్, లంకేశ్వరుడిగా సైఫ్ ఆలీ ఖాన్ నటించారు. భారీ బడ్జెట్‌తో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ టీ సిరీస్ నిర్మించిన ఈ చిత్రానికి ఓం రావత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 16వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన విశేషాల్లోకి వెళితే..
ప్రపంచానికి ఆదర్శ పురుషుడిగా నిలిచిన శ్రీ రామచంద్రుడి జీవిత కథను నేటితరం ప్రేక్షకులకు చెప్పాలనే లక్ష్యంతో ఆదిపురుష్ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను అత్యాధునిక టెక్నాలజీతో తెరకెక్కించారు ఈ సినిమాలో కొంత రియల్ షాట్స్, మరికొంత గ్రాఫిక్ టెక్నాలజీ ఉపయోగించారు.

ఆదిపురుష్ సినిమా టీజర్లు, ట్రైలర్లు భారీ క్రేజ్‌ను తీసుకు రావడం జరిగింది. అంతేకాకుండా ప్రేక్షకుల్లో శ్రీరాముడి నామజపం స్మరించేలా చేసింది. భారతీయ ప్రేక్షకులందరూ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్నారు. హిందూ పురాణంలోని పవిత్ర కావ్యాన్ని అద్బుతంగా అందించే ప్రయత్నం చేశారు.
శ్రీరాముడి పరమ భక్తుడు ఆంజనేయస్వామి ఆదిపురుష్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారారు. సినిమాలోనే కాకుండా ప్రేక్షకులకు స్పూర్తిగా నిలిచారు. ఆంజనేయస్వామిపై ఉన్న భక్తిని ప్రదర్శించుకొంటూ నిర్మాత, దర్శకులు ఆయనకు ఓ సీటును రిజర్వ్ చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఆదిపురుష్ సినిమాను ప్రదర్శించే థియేటర్లలో హనుమంతుడి కోసం ఓ సీటును రిజర్వ్ చేస్తామని చెప్పినట్టుగానే నిర్మాత, దర్శకులు మాటలను నిలుపుకొన్నారు. ప్రతీ థియేటర్‌లో ఒక సీటును రిజర్వ్ చేస్తూ ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అవుతున్నది.
ఆదిపురుష్ శ్రీరాముడి కోసం హనుమంతుడు థియేటర్‌కు వస్తాడనే భావనతో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకొన్నారు. నిర్మాతలు తీసుకొన్న నిర్ణయంపై శ్రీరామభక్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు. హనుమంతుడి రాకతో ఆదిపురుష్ థియేటర్ పవిత్రమైన భావనను పెంపొందిస్తుందనే భక్తి భావనతో నిర్మాతలు నమ్మకం పెట్టుకోవడం విశేషంగా మారింది.


Click it and Unblock the Notifications











