Adipurush: ప్రభాస్ ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్.. రాముడితోనే సీత కూడా!
పేరుకు బాలీవుడ్ సినిమానే అయినా.. చాలా కాలంగా దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోన్న సినిమానే 'ఆదిపురుష్'. దీనికితోడు తెలుగు సినీ ప్రియులు కూడా ఈ చిత్రం కోసం వేయి కళ్లలతో వేచి చూస్తున్నారు. దీనికి కారణం ఇందులో మన డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటిస్తుండడమే. అంతేకాదు, ఈ చిత్రం రామాయణం ఆధారంగా భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో రాబోతుంది. ఫలితంగా మొదటి నుంచీ భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకుంది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను యూనిట్ సభ్యులు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారని చెప్పొచ్చు.
బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ ఓం రౌత్‌తో కలిసి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేసిన చిత్రమే 'ఆదిపురుష్'. చెడు మీద మంచి ఎలా గెలిచింది అనే కాన్సెప్టుతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో విజువల్ వండర్‌గా వస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తి అయింది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతోన్నాయి. ఆ మధ్య ఈ సినిమా క్వాలిటీపై విమర్శలు రావడంతో మరోసారి విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి తాజాగా ఓ అదిరే పోస్టర్లు వచ్చాయి.

ఎంతో మంది స్టార్లు కలిసి నటిస్తోన్న 'ఆదిపురుష్' మూవీ రిలీజ్‌కు రెడీ అయిపోతోంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే వరుసగా దీని నుంచి అప్‌డేట్లను వదులుతున్నారు. ఇలా వారం రోజుల క్రితమే ప్రభాస్‌కు సంబంధించిన 'జై శ్రీరామ్' అంటూ సాగే ఓ లిరికల్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక, ఇప్పుడేమో ఈ సినిమా నుంచి 'జై సీతారాం' అంటూ సాగే మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో సీతాదేవిని హైలైట్ చేసి.. బ్యాగ్రౌండ్‌లో రాముడిని ఉంచారు. ఇందులో కృతి సనన్ అద్భుతంగా కనిపిస్తోంది. అలాగే, మరో పోస్టర్‌లో ఆమె కంట్లో కన్నీరు కనిపిస్తోంది.

భారీ బడ్జెట్‌తో వస్తున్న 'ఆదిపురుష్' మూవీని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక, ఈ చిత్రాన్ని జూన్ 16వ తేదీన విడుదల చేస్తున్నారు. ఇందులో ప్రభాస్ శ్రీరాముడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదత్తా నాగే హనుమంతుడిగా నటిస్తోన్నారు.


Click it and Unblock the Notifications











