Adipurush Trailer: ట్రైలర్‌తో ప్రభాస్ సంచలన రికార్డు.. ఈ థియేటర్లలో కూడా!
ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాలు రూపొందుతోన్నాయి. అయితే, అందులోనూ కొన్ని మాత్రమే ఎన్నో అంచనాలను ఏర్పరచుకున్నాయి. అలాంటి చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న 'ఆదిపురుష్' ఒకటి.
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ రూపొందిస్తోన్న ఈ సినిమా రామాయణంలో సరికొత్త పాయింట్లను చూపించేలా తెరకెక్కుతోంది. దీంతో ఆరంభంలోనే ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా భారీ బడ్జెట్‌తో తీస్తున్నారు.

ఓం రౌత్ - ప్రభాస్ కాంబినేషన్‌లో రాబోతున్న 'ఆదిపురుష్' మూవీ చెడు మీద మంచి ఎలా గెలిచింది అనే మెయిన్ పాయింట్‌తో రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తైనా.. పోస్ట్ ప్రొడక్షన్‌కు మాత్రం చాలా సమయం తీసుకున్నారు.
మంచి ఔట్‌పుట్ వచ్చే వరకూ వర్క్ చేస్తూనే వచ్చారు. ఇక, ఈ సినిమాను జూన్ 16న విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలను వదులుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్‌ను మే 9వ తేదీన విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు.
అత్యంత భారీ బడ్జెట్‌తో రాబోతున్న 'ఆదిపురుష్' మూవీ ట్రైలర్‌ను మే 9వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. అంతేకాదు, దీన్ని 2D, 3D టెక్నాలజీలతో తీసుకు వస్తున్నారు. అక్కడితో అయిపోలేదు.. ఈ ట్రైలర్‌ను యూట్యూబ్‌లోనే కాకుండా కొన్ని థియేటర్లలో కూడా నేరుగా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే వాటి లిస్టును కూడా వెల్లడించారు. ఇలా దాదాపు 70 దేశాల్లో దీన్ని విడుదల చేస్తున్నారు. తద్వారా ఈ ఘనతను సాధించిన ఏకైక చిత్రంగా ప్రభాస్ 'ఆదిపురుష్' సంచలన రికార్డును నమోదు చేసుకుంది.
ఇదిలా ఉండగా.. 'ఆదిపురుష్' చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదత్తా హనుమంతుడిగా చేస్తున్నారు. ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి అజయ్ - అతుల్ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











