Adipurush: పండుగలా ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఆ పుణ్యక్షేత్రానికి ప్రభాస్
టాలీవుడ్‌లోని ఏ స్టార్ హీరో కూడా చేయని విధంగా ఏకధాటిగా పాన్ ఇండియా చిత్రాల్లోనే నటిస్తూ దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపిస్తోన్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఇప్పుడు ఎన్నో సినిమాల్లో నటిస్తోన్న అతడు.. నేరుగా బాలీవుడ్‌లోనూ 'ఆదిపురుష్' అనే చిత్రాన్ని చేశాడు. రామాయణం నేపథ్యంలో చెడు మీద మంచి ఎలా గెలిచింది అనే కాన్సెప్టుతో ఈ సినిమా రూపొందింది. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందించారు. అందుకు తగ్గట్లుగానే దీన్ని హాలీవుడ్ రేంజ్‌లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ రూపకల్పనలో ప్రభాస్ నటించిన చిత్రమే 'ఆదిపురుష్'. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తైనా.. పోస్ట్ ప్రొడక్షన్‌కు మాత్రం చాలా సమయం తీసుకున్నారు. మంచి ఔట్‌పుట్ వచ్చే వరకూ వర్క్ చేస్తూనే వచ్చారు. ఇక, ఈ సినిమాను జూన్ 16న విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలను వదులుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మే 9వ తేదీన ఈ మూవీ ట్రైలర్‌ను, ఆ తర్వాత ఓ పాటను రిలీజ్ చేశారు. ఇక, ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై అధికారిక ప్రకటనను వదిలారు.

అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన 'ఆదిపురుష్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జూన్ 6వ తేదీన తిరుపతిలో ఎంతో గ్రాండ్‌గా జరపబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా అనౌన్స్ చేసింది. అంతేకాదు, 'ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఆదిపురుషుడు పవిత్రమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో దిగుతున్నాడు. ఇందుకోసం జూన్ 6వ తేదీని మీ క్యాలెండర్‌లో మార్క్ చేసుకుని ఉండండి' అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇక, ఈ ఈవెంట్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు మొదలు అయ్యాయి. దీనికి కొన్ని వేల మంది అభిమానులు హాజరు అయ్యే అవకాశం ఉందని తెలిసింది.
ఇదిలా ఉండగా.. 'ఆదిపురుష్' చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదత్తా హనుమంతుడిగా చేస్తున్నారు. ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి అజయ్ - అతుల్ సంగీతాన్ని సమకూర్చారు.


Click it and Unblock the Notifications











