Adipurush విషయంలో చిత్ర యూనిట్ షాకింగ్ నిర్ణయం.. ఇక ఆ వైబ్ లేనట్లే?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ జూన్ 16న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ రామాయణం కథ ఆధారంగా ఉండబోతుంది. ఇక ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఆదిపురుష్ ట్రైలర్ రికార్డ్ స్థాయిలో వ్యూస్ సాధించి ప్రేక్షకులకి భాగా కనెక్ట్ అయ్యింది. టీజర్ తో డిజపాయింట్ అయిన అందరూ కూడా ట్రైలర్ చూసాక పూర్తి సంతృప్తి చెందారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ తిరుపతి జూన్ 11న నిర్వహించబోతున్నారు. దానికోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో వైపు ఈ మూవీ బిజినెస్ డీల్స్ ఇప్పటికే క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. తెలుగులో 150 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన ఓ బ్యాడ్ న్యూస్ బయటకి వచ్చింది.

నిజానికి ఆదిపురుష్ మూవీ అడ్వాన్స్ ప్రీమియర్స్ వేయాలని భావించారు. ముఖ్యంగా మీడియాతో పాటు కొంత మంది అభిమానులకి జూన్ 13న ప్రత్యేక షోలు వేయాలని ముందుగా ప్లాన్ చేశారు. అయితే సమంత శాకుంతలం సినిమాని ఇలాగే ముందుగా స్పెషల్ ప్రీమియర్స్ వేశారు. అది సినిమాపై నెగిటివ్ క్రియేట్ చేసింది. మూవీ పెద్దగా బాగోలేదనే టాక్ ని జనాల్లోకి తీసుకెళ్ళింది.

ఆ ప్రభావం శాకుంతలం ఓపెనింగ్స్ మీద పడింది. ఇప్పుడు ఆదిపురుష్ మూవీ అడ్వాన్స్ ప్రీమియర్స్ వేయాలనే నిర్ణయంలో వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే బిటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. నెగిటివ్ టాక్ కి భయపడి ప్రీమియర్స్ క్యాన్సిల్ చేసుకున్నట్లు జోరుగా ప్రచారం నడుస్తోంది. జూన్ 16న మార్నింగ్ ప్రీమియర్స్ తో ఈ మూవీని డైరెక్ట్ గానే రిలీజ్ చేయనున్నారని సమాచారం. ఇక నిర్మాత టి-సిరీస్ భూషణ్ కుమార్, దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్ సినిమాపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ తో ఉన్నారు. కచ్చితంగా వెయ్యి కోట్లు కలెక్ట్ చేసే ప్రాజెక్ట్ గా ఈ మూవీ అవుతుందని అంచనా వేస్తున్నారు. మరి వారి అంచనాలకి తగ్గ రిజల్ట్ ఆడియన్స్ ఇస్తారా అనేది చూడాలి.


Click it and Unblock the Notifications











