ఆదిపురుష్ ట్రైలర్: ఇది కదా కావాల్సింది.. ఇక బాక్సాఫీస్ బ్లాస్ట్ అవ్వడం పక్కా!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా ఓం రౌత్ దర్శకత్వంలో చేసిన ఆదిపురుష్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఐదు భాషలలో రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. టీజర్ కి డివైడ్ టాక్ రావడంతో ట్రైలర్ ఎలా ఉండబోతోంది అనే ఆసక్తితో అందరూ ఎదురుచూశారు. అందరి అంచనాలు మించే విధంగా ఓం రౌత్ ట్రైలర్ ని గ్రాండియర్ గా ఆవిష్కరించారు.

ఇదిలా ఉంటే ఈ ట్రైలర్ ఇప్పుడు రికార్డులు సృష్టించింది. ముఖ్యంగా బాలీవుడ్ లో టీజర్ తోనే సత్తా చాటిన ఆదిపురుష్ ట్రైలర్ తో కూడా అదే సీన్ రిపీట్ చేసింది. హిందీలో ఆదిపురుష్ ట్రైలర్ ని 24 గంటల్లో ఏకంగా 52.22 మిలియన్స్ వ్యూవ్స్ రావడం విశేషం. బాలీవుడ్ లో అత్యధిక మంది వీక్షించిన ట్రైలర్స్ లో చూసుకుంటే తూత్ మైన్ మక్కర్ 50.96 మిలియన్స్ మంది 24 గంటల్లో వీక్షించారు.

Adipurush movie trailer response and records breaking

తరువాత రణవీర్ సింగ్ సర్కస్ ట్రైలర్ ని 45 మిలియన్స్ మంది వీక్షించగా, అక్షయ్ కుమార్ సామ్రాట్ పృథ్వీరాజ్ 43.86 మిలియన్స్ మంది వీక్షించారు.హృతిక్ రోషన్ 83 మూవీ ట్రైలర్ ని 24 గంటల్లో 43 మిలియన్స్ మంది వీక్షించారు. అయితే ఈ సినిమాలని ఆదిపురుష్ బీట్ చేయడం విశేషం. దీనిని బట్టి ప్రభాస్ కి నార్త్ ఇండియాలో ఏ రేంజ్ లో మానియా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఆదిపురుష్ హిట్ అయితే మాత్రం బాలీవుడ్ లో అన్ని రికార్డులని తిరగరాస్తుందనే మాట ఇప్పుడు వినిపిస్తోంది. ఇక ఆదిపురుష్ ట్రైలర్ ఓవరాల్ గా 5 భాషలలో కలిసి 24 గంటలలో 74.02 మిలియన్స్ వ్యూవ్స్, 2.1 మిలియన్ లైక్స్ సొంతం చేసుకోవడం విశేషం. వీటిలో తెలుగు ట్రైలర్ 13.79 మిలియన్ వ్యూవ్స్ 796.9 లక్షల లైక్స్ వచ్చాయి.

తమిళ్ లో 3.13M మిలియన్స్ వ్యూస్ సొంతం చేసుకోగా 85.9 వేల లైక్స్ వచ్చాయి. మలయాళీలో 3.12 మిలియన్ వ్యూస్ సొంతం ట్రైలర్ కి రాగా 66 వేల లైక్స్ సాధించింది. కన్నడంలో 1.76 మిలియన్స్ వ్యూవ్స్ ని సాధించగా 72 వేల లైక్స్ ని ఆదిపురుష్ ట్రైలర్ సాధించి రికార్డులు సృష్టించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X