Don't Miss!
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘ఆదిపురుష్’ పోస్టర్ వివరాలు లీక్: ప్రభాస్ ఎలా కనిపించబోతున్నాడో తెలుసా?
ఇంత కాలం తెలుగు సినిమాలతో సత్తా చాటి.. ఇప్పుడు నేరుగా బాలీవుడ్ మూవీలో నటిస్తున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. అదే.. 'ఆదిపురుష్'. చారిత్రాత్మక చిత్రాల దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా రామాయణం నాటి కథతో తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ముంబై నగర శివారు ప్రాంతాల్లో జరుగుతోంది. కరోనా సమయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మూవీ చిత్రీకరణ జరుపుతున్నారు. ఇక, ఈ సినిమా గురించి తాజాగా అదిరిపోయే న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'ఆదిపురుష్' నుంచి శ్రీరామనవమి కానుకగా ఓ పోస్టర్‌ను విడుదల చేయబోతున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీని కోసం ప్రభాస్ అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆ పోస్టర్ వెనుక అసలు కథ బయటకు వచ్చేసింది.
తాజా సమాచారం ప్రకారం.. నవమికి విడుదల చేయబోయే పోస్టర్లో శ్రీరాముడి పట్టాభిషేకానికి సంబంధించిన స్టిల్‌ను చూపించబోతున్నారట. ఇందులో అయితేనే అందరినీ ఒకేసారి చూపించొచ్చని చిత్ర యూనిట్ భావించినట్లు తెలిసింది. అందుకే దీనికి సంబంధించిన డిజైన్ రెడీ అవుతున్నట్లు బీ టౌన్లో ప్రచారం జరుగుతోంది.
రామాయణంలో ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో తెరకెక్కుతోన్న 'ఆదిపురుష్'ను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో ఇది రూపొందుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, సైఫ్ రావణుడిగా చేస్తున్నారు. టాల్ బ్యూటీ కృతి సనన్ సీతగా చేస్తోంది. సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను పోషిస్తున్నాడు.