twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఆదిపురుష్’ పోస్టర్ వివరాలు లీక్: ప్రభాస్ ఎలా కనిపించబోతున్నాడో తెలుసా?

    |

    ఇంత కాలం తెలుగు సినిమాలతో సత్తా చాటి.. ఇప్పుడు నేరుగా బాలీవుడ్ మూవీలో నటిస్తున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. అదే.. 'ఆదిపురుష్'. చారిత్రాత్మక చిత్రాల దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా రామాయణం నాటి కథతో తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ముంబై నగర శివారు ప్రాంతాల్లో జరుగుతోంది. కరోనా సమయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మూవీ చిత్రీకరణ జరుపుతున్నారు. ఇక, ఈ సినిమా గురించి తాజాగా అదిరిపోయే న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది.

    ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'ఆదిపురుష్' నుంచి శ్రీరామనవమి కానుకగా ఓ పోస్టర్‌ను విడుదల చేయబోతున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీని కోసం ప్రభాస్ అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆ పోస్టర్ వెనుక అసలు కథ బయటకు వచ్చేసింది.

    Adipurush Poster Prabhas Still Leaked

    తాజా సమాచారం ప్రకారం.. నవమికి విడుదల చేయబోయే పోస్టర్‌లో శ్రీరాముడి పట్టాభిషేకానికి సంబంధించిన స్టిల్‌ను చూపించబోతున్నారట. ఇందులో అయితేనే అందరినీ ఒకేసారి చూపించొచ్చని చిత్ర యూనిట్ భావించినట్లు తెలిసింది. అందుకే దీనికి సంబంధించిన డిజైన్ రెడీ అవుతున్నట్లు బీ టౌన్‌లో ప్రచారం జరుగుతోంది.

    రామాయణంలో ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో తెరకెక్కుతోన్న 'ఆదిపురుష్'ను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో ఇది రూపొందుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, సైఫ్ రావణుడిగా చేస్తున్నారు. టాల్ బ్యూటీ కృతి సనన్ సీతగా చేస్తోంది. సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను పోషిస్తున్నాడు.

    English summary
    Adipurush is a mythological 3D movie directed by Tanhaji fame Om Raut. The movie casts Prabhas playing the main lead role in this movie. Produced by Bhushan Kumar. Adipurush will be shot in Hindi...
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X