Adipurush ‘శ్రీరాముడి సినిమాను ఆపేందుకు కుట్ర.. ట్రోలర్స్‌ను దేవుడే శిక్షిస్తాడు’.. సెన్సేషనల్ కామెంట్

ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధిస్తున్నది. ఈ చిత్రం ఘన విజయం సాధిస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మైత్రీ మూవీస్ డిస్టిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆదిపురుష్ సినిమాను డిస్ట్రిబ్యూషన్ చేయడానికి అవకాశం ఇచ్చిన యూవీ క్రియేషన్స్‌కు ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను. మా సినిమాలను మేము ప్రమోట్ చేసుకొందామనే లక్ష్యంతో నైజాంలో మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూషన్‌ను ప్రారంభించింది. ఈ క్రమంలో ఆదిపురుష్ సినిమా డిస్డ్రిబ్యూట్ చేసే అవకాశం రావడంతో నవీన్, రవి ప్రకాశ్ అందరం హ్యాపీగా ఫీలయ్యాం. రెండు రోజుల్లోనే మేము అన్ని ఏర్పాట్లు చేసి సినిమాను ప్రేక్షకుల వద్దకు చేర్చాం అని తెలిపారు.

ఆదిపురుష్ సినిమాను చూడటానికి కొందరు ఫోటోలు పట్టుకొని వచ్చారు. 20 ఏళ్ల లోపు ఉండే ప్రేక్షకులను ఎలాంటి ఫోటోలు తీసుకురాలేదు. కిడ్స్ ఈ సినిమాను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. 4.30 గంటల షోను చాలా ఇంట్రెస్ట్‌గా చూశారు. వారికి నచ్చకపోతే నిద్రపోయేవారు. కానీ వారు 3 గంటల సినిమాను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంజాయ్ చేస్తూ ఆదిపురుష్‌ను చూశారు అని మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్ అన్నారు.

Adipurush

ఆదిపురుష్ సినిమాను ఓం రావత్ తీసిన తీరు సక్సెస్. ఈ సినిమాను ప్రస్తుతం జనరేషన్ వారి కోసం తీసిన సినిమా ఇది. రామాయణం చూడాలన్న, ఓటీటీ, టీవీలో వస్తుంటాయి. ఆ సమయంలో చిన్న పిల్లలు ఛానెల్ మార్చేస్తారు. కానీ ఆదిపురుష్ సినిమా పిల్లల్ని మెప్పించింది. థియేటర్‌లో వారు జైశ్రీరాం అంటూ కామెంట్స్ చేశారు.

Adipurush

ఆదిపురుష్ సినిమా టీజర్ రిలీజ్ చేసినప్పుడు చాలా ట్రోల్స్ వచ్చాయి. కానీ ఓం రావత్ మాత్రం సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన తర్వాత.. దానిని వాయిదా వేసి.. ఆరు నెలలు టైమ్ తీసుకొని చక్కగా రూపొందించారు. కొన్నిసార్లు ఏదైనా మార్పులు చేయమని అడిగితే.. మేము ఇలానే అనుకొన్నాం.. ఇలానే తీస్తాం అని అంటారు. కానీ ఓం రావత్ ఏదైతే అనుకొన్నాడో అదే తెరకెక్కించాడు అని శశిధర్ రెడ్డి అన్నారు.

Adipurush

ఆదిపురుష్ సినిమాను నైజాంలో రిలీజ్ చేస్తే ఒక సోలో హీరో సినిమాకు ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ అయింది. తొలి రోజు 13.6 కోట్లు, రెండో రోజు 8 కోట్లు వచ్చింది. మూడో రోజుల్లో నైజాంలో 29 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. అయితే కలెక్షన్లు బ్రహ్మండంగా ఉన్నాయి. ట్రోల్స్ చూస్తుంటే విపరీతంగా ఉన్నాయనే అనుమానం కలిగింది. ఎన్ని ప్రచారాలు జరిగినా కలెక్షన్లను ఆపలేకపోయాయి. ప్రజల్లో భక్తిని నిలువరించలేకపోయాయి. ట్రోల్స్ పెరిగినా.. రెండో రోజు కంటే మూడో రోజు కలెక్షన్లు పెరిగాయి. దీన్ని బట్టి.. వీలైతే మంచి చేయండి. లేదంటే కామ్‌గా ఉండండి. దేవుడి సినిమాను కూడా ట్రోల్స్ చేసే స్థాయికి దిగజారాయి.

ట్రోల్స్ చేయడం వల్ల మీ క్యారెక్టర్‌కు డామేజ్. ట్రోల్స్‌ను దేవుడే చూసుకొంటాడు. దేవుడి సినిమాను అడ్డుకోవడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేవుడి సినిమానే అడ్డుకొంటే.. దేవుడు ఏం చేయాలో అది చేస్తాడు. ఈ సినిమాను ప్రస్తుతం జనరేషన్ చూడాలి. అలాంటి అవకాశం ఓం రావత్ రూపంలో వచ్చింది. అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి అని శశిధర్ రెడ్డి తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X