Adipurush Update: అనుకున్నదే అయింది, కొత్త రిలీజ్ డేట్ ప్రకటన.. రిలీజ్ ఎప్పుడంటే?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సాహో' సినిమా కమర్షియల్ గా హిట్ కాకపోయినా కలెక్షన్స్ విషయంలో ఎక్కడా తగ్గలేదు. ఆయన నటించిన రాధేశ్యామ్ సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ప్రభాస్ ఇప్పటికే వరుస సినిమాలు లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన నటించిన ఆది పురుష్ సినిమా నుంచి అప్డేట్ వచ్చేసింది. శివరాత్రి సందర్భంగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. ఆ వివరాల్లోకి వెళితే
Recommended Video

చిత్రీకరణ కూడా
ప్రభాస్ చేస్తున్న అనేక సినిమాలలో ప్రేక్షకులు అందరూ విపరీతంగా ఎదురు చూస్తున్న సినిమాలలో ఆది పురుష్ సినిమా ఒకటి. యంగ్ రెబల్ స్టార్ నటిస్తున్న ఈ పౌరాణిక చిత్రం "ఆదిపురుష్" షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. రాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీఖాన్, సీతగా కృతి సనన్, లక్ష్మయుడిగా సన్నీ సింగ్ వంటి వారు నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. తమ తమ పార్టులు షూటింగ్ పూర్తి చేశారు. నటీనటులందరితో సహా మొత్తం సినిమా చిత్రీకరణ కూడా పూర్తయింది. ఈ సందర్భంగా చిత్రబృందం కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంది.

గ్రాఫిక్స్‌కు అధిక ప్రాధాన్యత
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో గ్రాఫిక్స్‌కు మేకర్స్ అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే చిత్రీకరణ పూర్తి చేసిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్‌పై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. "ఆదిపురుష్"లో ఎక్కువగా గ్రాఫిక్స్ కు ప్రాముఖ్యత ఉండడంతో విఎఫ్ఎక్స్ వర్క్ మీద దృష్టి పెట్టారు. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఆదిపురుష్ సినిమా రూపొందుతోంది. హిందీ, తెలుగు భాషల్లో చిత్రీకరించబడిన ఈ చిత్రం తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో డబ్బింగ్ వెర్షన్ విడుదల కానుంది.

ముందే అంచనా వేసుకున్నా
నిజానికి ముందుగా ఈ ఆదిపురుష్ సినిమాను ఆగస్టు 11, 2022న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఇది పీరియాడికల్ ఫిల్మ్ కాబట్టి, ప్రభాస్ నటించిన బాహుబలి, సాహో మరియు రాధే శ్యామ్‌ల విషయంలో ఎలా డిలే అయిందో అలాగే ఈ చిత్రానికి కూడా ఎక్కువ సమయం పడుతుందని ప్రభాస్ అభిమానులు ముందే అంచనా వేసుకున్నారు.

రామ కాదు రాఘవ
అయితే ముందు నుంచి పౌరాణిక సినిమా అనుకున్నారు కానీ ఆదిపురుష్' 7000 సంవత్సరాల క్రితం నాటిది, రామాయణంలో ఉన్నటువంటి కీలకమైన అంశాలన్నీ సినిమాలో ఉన్నాయని తాజాగా ఓం రౌత్ వెల్లడించారు. సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ పేరు రామ కాదు రాఘవ అని, ఇది రాముడికి మరో పేరని అన్నారు. ఇక కృతి సనన్ పోషించిన సీతని జానకి అని, సైఫ్ అలీ ఖాన్ పోషిస్తున్న రావణుడి పాత్ర పేరు లంకేశ్వరుడని చెప్పుకొచ్చారు.
2023 జనవరి 12న
అయితే ఇప్పుడు ఈ సినిమా తాజా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా 2023 జనవరి 12న 3డీలో విడుదల చేస్తామని ప్రకటించారు. మహా శివరాత్రి సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడిస్తున్నామని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఒకరకంగా సంక్రాంతికి రాధేశ్యామ్ వస్తుందని భావించి నిరాశ పాలైన ప్రభాస్ అభిమానులకు ఇది కొంచెం ఇష్టం కొంచెం కష్టం అనిపించే నిర్ణయం. వాయిదా పడిందని బాధ పడాలో లేక సంక్రాంతి బరిలో దిగుతుందని ఆనందపడాలో అర్ధం కానీ పరిస్థితుల్లో పడ్డారు.


Click it and Unblock the Notifications











