Adipurush Twitter Review ఆదిపురుష్ మూవీ ఎలా ఉందంటే? సోషల్ మీడియాలో టాక్ వైరల్
రెబల్ స్టార్ ప్రభాస్, అందాల భామ కృతిసనన్ నటించిన ఆదిపురుష్ చిత్రం అట్టహాసంగా రిలీజైంది. అమెరికాలో ప్రీమియర్లకు అభిమానులు పోటెత్తారు. ప్రీమియర్లు చూస్తున్న ప్రేక్షకులను సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ట్విట్టర్‌లో సినీ ప్రేక్షకులు వెల్లడించిన రివ్యూలు మీ కోసం

ఆదిపురుష్ గుడ్ మూవీ. ఊహకు అందని విజువల్స్. ప్రభాస్ రాముడిగా తెర అద్బుతంగా కనిపించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మెలోడిస్ బ్యూటిఫుల్‌గా ఉన్నాయి అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.
ఆదిపురుష్ ఫస్టాఫ్ బాగుంది. మ్యూజిక్‌తో డ్రామా అద్బుతంగా పండింది. యాక్షన్ సీక్వెన్స్‌లో వీఎఫ్ఎక్స్ చాలా పూర్‌గా ఉన్నాయి. ఫైటింగ్ సీన్స్ ఆకట్టుకొనేలా ఉన్నాయి. సెకండాఫ్ కోసం ఎదురు చూస్తున్నాను అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ఆదిపురుష్ ఫస్టాఫ్ బ్లాక్ బస్టర్. సెకండాఫ్ కోసం ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నాం. ప్రభాస్‌కు బ్లాక్ బస్టర్ హిట్ ఖాయం. సెలబ్రేషన్స్ మొదలయ్యాయి అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ఆదిపురుష్ ఫస్టాఫ్ బాగుంది. ప్రారంభంలో వచ్చే యానిమేషన్ సీన్లు బాగున్నాయి. శ్రీరాముడి కథ చెప్పిన విధానం బాగుంది. పాటలు, బీజీఎం, సినిమా కథకు సంబంధించిన ఆత్మ ఎక్సలెంట్. ప్రభాస్, కృతి సనన్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. అక్కడక్కడ ఫస్టాఫ్ గుడ్ బాగుంది. విజువల్‌గా గ్రాండియర్‌గా ఉంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.


Click it and Unblock the Notifications











