twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ గురించి హీరో అరుణ్ అదిత్

    |

    తుంగభద్ర, కథ, పిఎస్వీ గరుడ వేగా, 24 కిస్సెస్‌ తదితర చిత్రాల్లో నటించిన హీరో ఆదిత్‌ అరుణ్‌ త్వరలో 'చీకటి గదిలో చితక్కొట్టుడు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బ్లూ ఘోస్ట్‌ పిక్చర్స్‌ బేనర్‌పై సంతోష్‌ పి జయకుమార్‌ దర్శకత్వంలో అడల్ట్‌ హారర్‌ కామిడీగా రూపొందిన ఈచిత్రం మార్చి 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    ఈ సందర్భంగా మీడియాతో అదిత్ అరుణ్ మాట్లాడుతూ ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు వెల్లడించారు. నేను ముందు నుంచీ రెగ్యులర్‌ ప్యాట్రర్న్ సినిమాలు చేయడం లేదు. 24 కిస్సెస్‌, ఎల్‌ 7, కథా ఇలా అన్ని సినిమాలు విభిన్నమైనమే. చీకటి గదిలో చితక్కొట్టుడు పూర్తి డిఫరెంట్ జోనర్. ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్నపుడు కాస్త భయం వేస్తుంటుందని తెలిపారు.

    Adith Arun about Cheekati Gadilo Chitakottudu movie

    తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయగలిగితే వారు ఏ జోనర్‌లో అయినా చూస్తారు. తమిళంలో పరిస్థితి వేరే విధంగా ఉంటుంది వారికి డిఫరెంట్‌ స్టోరీ అయితేనే వారు చూస్తారు. ఈ సినిమా విజయం పట్ల చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నామని తెలిపారు.

    పెళ్లి కోసం అమ్మాయిని వెతుక్కునే చందు అనే పాత్రలో నటించాను. తమిళంలో ఈ సినిమా పేరు 'ఇరుటారియల్‌ మొరటు కుత్తు'.. తెలుగులో 'చీకటి గదిలో చితక్కొట్టుడు' అని అర్థం. అందుకే ఆ టైటిల్ పెట్టాం. స్కిన్ షో, లిప్‌లాక్‌ సీన్లు లేకుండా ఫస్ట్‌ సీన్‌ నుండి లాస్ట్‌ సీన్‌ వరకు ఆడియెన్స్‌ నవ్వించే విధంగా సినిమా ఉంటుందని అరుణ్ అదిత్ తెలిపారు.

    ఈ సినిమా మనీ కోసం చేయలేదు, సినిమా స్టోరీ నచ్చింది కాబట్టే చేశాను. నాకు నచ్చిన సినిమాను ఎంజాయ్‌ చేస్తూ చెయ్యాలి అనేది నా పాలిసీ. ప్రస్తుతం కొలంబస్‌ ఫేమ్‌ రమేష్‌ సామలతో 'డ్యూడ్‌' అనే చిత్రాన్ని చేస్తున్నాను. ఫ్రెండ్షిప్‌ నేపథ్యంలో ఉంటుంది. ఇది కాక మరో రెండు చిత్రాలకు సైన్‌ చేశాను. త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తాను అని అదిత్ అరుణ్ తెలిపారు.

    English summary
    Adith Arun about Cheekati Gadilo Chitakottudu movie. Chikati Gadilo Chithakotudu movie ft. Adith and Nikki Tamboli. Directed by Santhosh P Jayakumar and Music by Balamurali Balu. Produced by Blue Ghost Pictures.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X