రవితేజతో ‘మహాసముద్రం’లో దిగే హీరోయిన్ ఈవిడేనంట!
ఆర్‌ఎక్స్ 100 మూవీ ద్వారా తొలి ప్రయత్నంలోనే విజయం అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి తన తర్వాతి సినిమా రవితేజతో ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ చిత్రానికి 'మహాసముద్రం' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు రవితేజ చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ చిత్రం ఉండబోతోందట.
తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో రవితేజ సరసన... హీరోయిన్‌గా అదితి రావు హైదరిని తీసుకునే ఆలోచనలో ఉన్నారట. 'సమ్మోహనం' మూవీ తర్వాత అదితి రావుకు తెలుగులో మంచి డిమాండ్ ఏర్పడింది. ఆ తర్వాత ఆమెకు పలు అవకాశాలు వచ్చినా... పెద్ద హీరో కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తోంది. రవితేజతో ఛాన్స్ రావడంతో వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

'ఆర్‌ఎక్స్ 100' చిత్రాన్ని కొత్త హీరోతో తీసిన అజయ్ భూపతి.... తన సత్తా ఏమిటో నిరూపించారు. అయితే రెండో మూవీ మంచి గుర్తింపు ఉన్న స్టార్‌తో చేయాలని డిసైడ్ అయ్యారు. పలువురు స్టార్లతో సంప్రదింపులు జరుపగా చివరకు రవితేజతో ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ పొడక్షన్ దశలో ఉంది. సెప్టెంబర్ నుంచి షూటింగ్ మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారు.
రవితేజ ప్రస్తుతం 'డిస్కో రాజా' అనే చిత్రం చేస్తున్నారు. విఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్‌ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రవితేజతో 'నేల టిక్కెట్' మూవీ చేసిన రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ, పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, బాబీసింహా, వెన్నెల కిషోర్, సత్య తదితరులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











